నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని.. | Nagamani Deceased In Ameenpur With Extramarital Affair | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని..

Dec 5 2021 8:25 AM | Updated on Dec 5 2021 10:41 AM

Nagamani Deceased In Ameenpur With Extramarital Affair - Sakshi

నాగమణి (ఫైల్‌)  

సాక్షి, హైదరాబాద్‌(పటాన్‌చెరు టౌన్‌): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన మహిళ మృతదేహమై కనిపించిన ఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని జానకంపేటకు చెందిన తలారి నర్సింలు భార్య నాగమణి(35) ఈ నెల 1న జిన్నారం వెళ్తున్నానని ఇంట్లో కుమారుడికి చెప్పి వెళ్లిఅదృశ్యమైంది. భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మృతురాలు పటాన్‌చెరులో మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు.

చదవండి: (భర్తతో గొడవలు.. బ్యూటీషియన్‌ ఆత్మహత్య)

జిన్నారం మండలం మాధారం మధిరగ్రామం దువ్వకుంటకు చెందిన జంగయ్యకు నాగమణికి నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. బుధవారం ఇద్దరు రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్‌ కాలనీ వైపు ఉన్న పెద్దకుంట వద్ద మద్యం సేవించారు. నాగమణి ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతుండడంతో మద్యం మత్తులో ఉన్న జంగయ్య ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు తీసుకుని మృతదేహాన్ని పెద్దకుంటలో పడేశారు. జంగయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యానేరం ఒప్పుకున్నాడడు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం, అదనపు ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ భీంరెడ్డి పరిశీలించారు. నిందితుడి నుంచి నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement