patancheru town
-
నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని..
సాక్షి, హైదరాబాద్(పటాన్చెరు టౌన్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన మహిళ మృతదేహమై కనిపించిన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని జానకంపేటకు చెందిన తలారి నర్సింలు భార్య నాగమణి(35) ఈ నెల 1న జిన్నారం వెళ్తున్నానని ఇంట్లో కుమారుడికి చెప్పి వెళ్లిఅదృశ్యమైంది. భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మృతురాలు పటాన్చెరులో మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (భర్తతో గొడవలు.. బ్యూటీషియన్ ఆత్మహత్య) జిన్నారం మండలం మాధారం మధిరగ్రామం దువ్వకుంటకు చెందిన జంగయ్యకు నాగమణికి నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. బుధవారం ఇద్దరు రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీ వైపు ఉన్న పెద్దకుంట వద్ద మద్యం సేవించారు. నాగమణి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండడంతో మద్యం మత్తులో ఉన్న జంగయ్య ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు తీసుకుని మృతదేహాన్ని పెద్దకుంటలో పడేశారు. జంగయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యానేరం ఒప్పుకున్నాడడు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, అదనపు ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ భీంరెడ్డి పరిశీలించారు. నిందితుడి నుంచి నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
సంధ్యారాణి డెత్ మిస్టరీ!
-
విద్యార్థులపై పోలీసుల దాష్టీకం
పటాన్చెరు టౌన్: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బుధవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమం లో మృతురాలి తండ్రి ని ఓ కానిస్టేబుల్ బూటు కాలుతో తన్నడం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వెలిమెలలోని నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి (16) ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతదేహంతో నారాయణ కళాశాల ఎదుట ధర్నా చేయాలని బాధితులు, కొన్ని విద్యార్థి సంఘాలు యత్నించాయి. మరోవైపు కొందరు యువకులు ఆస్పత్రిలోని మార్చురీ తలుపుల తాళాలు పగులగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని తీసుకుని తెచ్చారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని మళ్లీ మార్చురీ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్.. మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో తన్నారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యార్థిని చనిపోయిందని చెబుతున్న గదిని చూపిస్తామని మృతురాలి బంధువులను తీసుకువెళ్లారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆస్పత్రి పోస్టుమార్టం గది తలుపులు పగలగొట్టిన ఘటనలో విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పటాన్చెరు సీఐ నరేశ్ తెలిపారు. కానిస్టేబుల్‌పై వేటు: ఇన్చార్జి ఎస్పీ: కానిస్టేబుల్ శ్రీధర్ మృతిరాలి తం డ్రితో దురుసుగా ప్రవర్తించడంపై శాఖ తరఫున చింతిస్తున్నట్లు ఇన్చార్జి ఎస్పీ చందనాదీప్తి అన్నారు. కానిస్టేబుల్‌ను ఏఆర్ హెడ్ క్వార్టర్ సంగారె డ్డికి అటాచ్ చేశామన్నారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు. -
కాలకూట విషం
పటాన్చెరులో పారుతున్న వ్యర్థ, రసాయనాలు భూగర్భ జలాలు సైతం విషపూరితం ఆందోళన చెందుతున్న ప్రజలు పటాన్చెరు టౌన్: పట్టణంలో వివిధ రసాయాన కాలుష్య వ్యర్థ జలాలు ఏరులై పారుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం కాలుష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. భూగర్భ జలాలు సైతం విషపూరితం అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అతిపెద్ద పారిశ్రామిక వాడగా దేశంలో పేరు గడించిన పటాన్చెరులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడ్డారు. మహారాష్ట్ర బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎంతో మంది వివిధ పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరందరిని కాలుష్యం కబళిస్తుంది. ఎవ్రికీ తెలియకుండా చాపకిందనీరులా కాలుష్యం జనాల శరీరాల్లోకి వెళ్లిపోతోంది. పట్టణంలోని ఆల్విన్‌కాలనీకి వెళ్లే రహదారి, ఫాదర్ స్కూల్ సమీపంలో కాలుష్యజాలాలు ఏరులై పారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ ప్రాంతంలో ఉండే పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యర్థ, రసాయన జలాలను వెనకనే ఉన్న పెద్దకాలువలోకి నిత్యం వదిలేస్తున్నారు. ఆ జలాలు తాగునీటిలో కలసి కలుషితం చేస్తున్నాయి. ఫాదర్స్కూల్సమీపంలో ఒక వాటర్ ట్యాంక్, పెద్ద సంపు ఉన్నాయి. ఈ ట్యాంకు నుంచి వివిధ ప్రాంతాలను నిత్యం తాగునీరు అందుతోంది. అయితే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థజలాలు ఈ ట్యాంకు సంపులో కలుస్తుండటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యర్థ జలాలు వర్షపునీటితో కలసి సంపులోకి వెళుతున్నా సంబంధిత అధికారులు కానీ, స్థానిక పాలకులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మకై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రసాయ జలాలు వచ్చే కాలువను జేసీబీతో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూడిక కూడా తీయించారు. దీంతో పరిశ్రమల వ్యర్థ జలాలు మరింత ఎక్కువగా మంచినీటి సంపులో కలిసేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ఈ ట్యాంక్‌నుంచి సరఫరా అయ్యే మంచినీరు కలుషితమయంగా వస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల రసాయన జలాలు కలిసిన ఈ మంచినీరు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ నీటి వల్ల తాతాలికంగా కాకపోయిన దీర్ఘకాలిక వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భూగర్భ జలాలలు సైతం ఈ రసాయనాల వల్ల విషతుల్యం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయం ఎన్నోసార్లు అధికారులకు, పాలకులకు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి కాలుష్య జలాలు మంచినీటి సంపులో కలవకుండా చూడాలని కోరుతున్నారు. ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలను కాలుకూట విష జలాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. పటాన్చెరు, రసాయన జలాలు, ప్రజల ఆందోళన పరిశ్రమల నుంచి కాలువల్లోకి వస్తున్న రసాయన జలాలు