Missing woman
-
నాలుగు నెలల గర్భిణి.. చెకప్ కోసమని వెళ్ళి అక్కడి నుండి అదృశ్యం
ఆలేరురూరల్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆలేరు పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన యాస్మిన్ నాలుగు నెలల గర్భిణి. ఆదివారం సాయంత్రం చెకప్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యాస్మిన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యాస్మిన్ తండ్రి మహమ్మద్ లాల్‌బీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపారు. యాస్మిన్ తన భర్త గుడుమియాతో కలిసి సిద్దిపేటలో నివాసముంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ... ప్రయాణికులు సురక్షితం మిర్యాలగూడ టౌన్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు సోమవారం మిర్యాలగూడ మండలం ముల్కలకాలువకు వెళ్తూ ఆలగడప వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ పాండు మిర్యాలగూడ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్‌కు తెలియజేయగా.. డీఎం ఆదేశాల మేరకు బస్సు డ్రైవర్ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బీచ్ రోడ్డులో చున్నీ, చెప్పులు.. అసలు ఏం జరిగింది?
కాకినాడ రూరల్: మండలంలోని నేమాం గ్రామానికి చెందిన వివాహిత రేవు లావణ్య అదృశ్యమైంది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన లావణ్యకు నాలుగేళ్ల క్రితం నేమాం గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహం జరిగింది. వీరికి ఇంకా సంతానం లేదు. అత్తింటి వద్దే ఉంటున్న లావణ్య మంగళవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైంది. నాలుగు గంటలకు నిద్ర లేచి చూడగా భార్య కనిపించలేదని శ్రీను చెప్పాడు. చదవండి: హోటల్ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్! రాజవొమ్మంగిలోని లావణ్య పుట్టింటి వారికి విషయం చెప్పడంతో వారు తిమ్మాపురం పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పిల్లలు పుట్టలేదని, కట్నం కావాలని తన కుమార్తెను భర్త, అత్త వేధించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు లావణ్య ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని ఆమె తల్లి లంకాడి వెంకటలక్ష్మి ఆరోపించింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగార్జునరాజు వారికి నచ్చజెప్పి, అదృశ్యం కేసు నమోదు చేశారు. లావణ్య ఆచూకీ కోసం నేమాంతో పాటు నేమాం – సూర్యారావుపేట బీచ్‌లో గాలించారు. బీచ్‌లో రోడ్డు పక్కన ఆమె చున్నీ, చెప్పులు గుర్తించారు. సముద్రంలోకి దిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర తీరంలో గాలింపు చేపట్టారు. -
నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని..
సాక్షి, హైదరాబాద్(పటాన్చెరు టౌన్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన మహిళ మృతదేహమై కనిపించిన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని జానకంపేటకు చెందిన తలారి నర్సింలు భార్య నాగమణి(35) ఈ నెల 1న జిన్నారం వెళ్తున్నానని ఇంట్లో కుమారుడికి చెప్పి వెళ్లిఅదృశ్యమైంది. భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మృతురాలు పటాన్చెరులో మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (భర్తతో గొడవలు.. బ్యూటీషియన్ ఆత్మహత్య) జిన్నారం మండలం మాధారం మధిరగ్రామం దువ్వకుంటకు చెందిన జంగయ్యకు నాగమణికి నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. బుధవారం ఇద్దరు రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీ వైపు ఉన్న పెద్దకుంట వద్ద మద్యం సేవించారు. నాగమణి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండడంతో మద్యం మత్తులో ఉన్న జంగయ్య ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు తీసుకుని మృతదేహాన్ని పెద్దకుంటలో పడేశారు. జంగయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యానేరం ఒప్పుకున్నాడడు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, అదనపు ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ భీంరెడ్డి పరిశీలించారు. నిందితుడి నుంచి నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం
శ్రీకాళహస్తి రూరల్: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ అస్థిపంజరంగా కనిపించిన సంఘటన మండలంలోని విశాలాక్షినగర్‌లో ఆది వారం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. విశాలాక్షినగర్‌లో అమ్ములు అనే మహిళ నివాసముంటుంది. ఆమె కుమార్తె ఉష ఖమ్మం పట్టణానికి చెందిన నాగ రాజు అలియాస్ నిరంజన్ను ప్రేమించడంతో తొమ్మిదేళ్ల కిందట వారికి వివాహం జరిపించింది. రూ.5 లక్షలు అప్పు చేసి, ఇంటిని నిర్మించుకుని అందరూ కలసి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉష శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తుండగా నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటే అప్పు ఎలా తీర్చాలంటూ అమ్ములు తరచూ అల్లుడిని మందలించేది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి అమ్ములు కనిపించకుండా పోయింది. దీంతో ఉష గత జనవరి 9న శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నాగరాజు తమ ఊర్లో పని ఉందంటూ ఖమ్మం వెళ్లి, తిరిగిరాలేదు. ఇంటి ప క్కనే ఉన్న దిబ్బలో చెత్త తమ ఇంటి ఆవరణలోకి వస్తోందని, దాన్ని తొలగించాలని పక్క ఇంటి వారు అడుగుతుండడంతో ఉష ఆదివారం కూలీలతో పేడ దిబ్బను తొలగించింది. దిబ్బలో పుర్రె, ఎముకలు బయటపడడంతో వెంటనే ఆమె ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ వెంకటేష్, తహసీల్దార్ ఉదయ్‌సంతోష్ సిబ్బందితో కలసి ఘటనా స్థలా నికి చేరుకున్నారు. అస్థిపంజరాన్ని వెలుపలకి తీశారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆర్సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవపంచనామా నిర్వహించారు. దిబ్బలో అమ్ములు చీర, నాగరాజు లుంగీ లభ్యం కావడంతో అల్లుడు నాగరాజుపైన అనుమానం వ్యక్తమవుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ -
కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన యువతి మృతి
-
అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..
సాక్షి, ములుగు: భర్త మరణించిన అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన వ్యక్తిగత సంబంధం మహిళ ప్రాణాలను బలికొంది. నమ్మిన వ్యక్తితో వెళ్లిన మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపల్లి జీపీ పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి నూనావత్ రాధ(45) భర్త సారయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు రాజుతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాధతో అదే గ్రామానికి చెందిన జాటోతు భోజ్యానాయక్ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. గత నెల 18వ తేదీన రాధ భోజ్యనాయక్తో గట్టమ్మకు మొక్కులు చెల్లించడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆలయానికి కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తెచ్చిన స్కార్ప్‌తో రాధను హతమార్చాడు. ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భోజ్యానాయక్ స్కార్ప్‌తో చెట్టుకు ఉరి వేసుకొని రాధ మృతి చెందినట్లుగా కట్టిపడేశాడు. అందరూ ఆత్మహత్యగా భావిస్తారని గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి వెళ్లాడు. ఫిర్యాదుతో.. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు నూనవత్ రాజు గత నెల 28న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు రెండో ఎస్సై డీవీ ఫణీ నేతృత్వంలో పోలీసులు మృతురాలి కాల్ డేటాను సేకరించారు. చివరి రెండు రోజుల్లో భోజ్యానాయక్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు రాధను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భోజ్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన వెళ్లి చూడగా రాధ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. నిందితుడిపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణీ పాల్గొన్నారు. రోధనలతో మిన్నంటిన గట్టమ్మ గుట్ట రాధ మృతదేహం కుళ్లిపోయి అస్థిపంజరంగా దర్శనమివ్వడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోధలనతో గట్టమ్మ గుట్ట పరిసర ప్రాంతాలు మిన్నంటాయి. అస్థిపంజరం మాత్రమే ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. -
ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య
లండన్: ఇంగ్లండ్‌లో 15 రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ పర్దీప్ కౌర్ హత్యకు గురైంది. లండన్‌లోని హీత్రో విమానాశ్రయం సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వివాహిత అయిన పర్దీప్ కౌర్ ఓ హోటల్లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ 16న ఆమె ఉద్యోగానికి వెళ్లిన తర్వాత మళ్లీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడని, గొంతు పిసికి చంపి హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయం సమీపంలో లభ్యమైన మృతదేహాన్ని పర్దీప్ కౌర్దిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. -
తల్లి చెంతకు వివాహిత
శ్రీకాకుళం: సారవకోట మండలంలోని అలుదు గ్రామానికి చెందిన వివాహిత తోటాడ నీలవేణి (21)ని సోమవారం పాతపట్నం సీఐ శ్రీనివాసరావు ఆమె తల్లి తవిటమ్మకు అప్పగించారు. ఏడాది క్రితం తన కుమార్తె కనిపించడం లేదని తవిటమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా సోమవారం నీలవేణి గుర్తించి ఆమె తల్లికి అప్పగించినట్టు సీఐ తెలిపారు. అయితే కేసు నమోదు చేసినప్పటికి ఆమె అవివాహితని, ప్రస్తుతం వివాహం అయి, ఒక బిడ్డకు తల్లికూడానని ఆయన తెలిపారు. సీఐతో పాటు ట్రైనీ ఎస్ఐ మధుసూదనరావు, ఏఎస్ఐ ఎంఆర్కే రెడ్డి, హెచ్‌సీ శ్రీనివాసరావు ఉన్నారు. -
అమ్మ బతికే ఉందా?
ఓ ప్రధాన పార్టీ అనుబంధ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురంలోని తన స్నేహితుడు ఎర్రిస్వామి ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతని భార్య ఇంట్లోంచి మాయమైంది. కంబదూరులో మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులకు ఎర్రిస్వామి కూడా ఫిర్యాదు చేశాడు. ఇపుడు ఆమె బతికే ఉందా.. లేదా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయూలని డీజీపీ నుంచి జిల్లా పోలీసులకు ఆదేశాలందారుు. ఏం జరిగిందో కానీ పోలీసులు ఇప్పటి వరకు ఆ కేసు సంగతి తేల్చలేదు. దీంతో ఎర్రిస్వామి పిల్లలు ఏడాదిగా పడుతున్న ఆవేదన వారి మాటల్లోనే.. సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘మా పేర్లు అమృతకర్, వర్షిత్కర్. ఎర్రిస్వామి, సుజాతల ముద్దుల కొడుకులం. మమ్మల్ని మా అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నారో.. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్లో మాటల్లో చెప్పలేం. ఏం జరిగిందో.. ఏమో తెలీదు. ఏడాది నుంచి మా అమ్మ కన్పించడం లేదు. అమ్మ ఎక్కడికెళ్లింది నాన్నా.. అంటే పనిపై ఊరికెళ్లింది...త్వరలో వస్తుంది కన్నా అని చెబుతున్నాడు. చాలా రోజులైనా అమ్మ రాలేదు. మళ్లీ అడిగాం. నాన్న నోటి నుంచి మరో రకమైన సమాధానం. ఎప్పుడు అమ్మ గురించి అడిగినా.. అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుందని చెబుతున్నాడు కానీ అమ్మ రాలేదు. కళ్లనిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో మాకు తెలీదు.. ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. అమ్మ కనిపించలేదని కంబదూరు పోలీసు స్టేషన్లో మా తాతయ్య ఫిర్యాదు చేశాడు. అమ్మ ఎక్కడుందో మాకే కాదు.. నాన్నకూ తెలీదని అప్పుడు తెలిసింది. అమ్మ లేదని నాన్న రోజూ వేదనపడుతున్నాడు. సరిగా అన్నం తినేవాడు కాడు. రాత్రింతా మేల్కొని దిగాలు కూర్చున్న రోజులు ఈ ఏడాదిలో ఎన్నో. మా అమ్మలేదని ఇరుగుపొరుగు వారూ అడుగుతున్నారు. ఉదయం బడికి వెళ్లేముందు పిల్లలందరూ ‘బాయ్...మమ్మీ’ అంటుంటే మా అమ్మ గుర్తొస్తుంది. భరించలేని బాధేస్తోంది. అమ్మచేతి ముద్ద తినక, అమ్మ ఒడిలో పడుకోక ఎన్ని రోజులైందో.. అమ్మ లేదని, మా ఆలనాపాలన చూసుకునేవారు లేరని కుమిలి కుమిలి మా నాయనమ్మ చనిపోయింది. దీంతో మాకు అన్నం చేసేదిక్కు కూడా లేకుండా పోయింది. మా బాధకు తోడు అమ్మమ్మ చనిపోయిందనే బాధతో మా తాతయ్య(నాన్న నాన్న) కూడా చనిపోయాడు. అమ్మ ఎక్కడుందో తెలీదు.. నాయనమ్మ, తాతయ్య చనిపోయారు. ఇవన్నీ నాన్నను మరింత కుంగదీశాయి. మా నాన్న పేరు ఎర్రిస్వామి అని ఎందుకు పెట్టారో తెలీదు కాని... ఇటీవల నిజంగా ఎర్రోడైపోయాడు. ఈ బాధ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. ‘నేనూ చనిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు కన్నా’ అని మమ్మల్ని ఒళ్లోకి తీసుకుని తలపై చేతితో తడుముతూ బోరున ఏడుస్తాడు. నాన్న బాధ చూస్తే ముగ్గురం మూకుమ్మడికి చచ్చిపోదామా.. అనిపిస్తుంది. బాధను దిగ మింగుకుని అలా కాలం గడుపుతున్నాం. అమ్మ కనిపించలేదని నాన్న పోలీసులకు చెప్పాడు. డీజీపీకి కూడా చెప్పారంట. అయినా ఫలితం లేదు. ఏం చేద్దాం దేవుడు మాకు ఇలా రాసిపెట్టిఉంటే ఎవరేం చేస్తారు. ‘ఎస్పీ అంకుల్.. మాదో ఓ చిన్న విన్నపం. మా అమ్మ బతికే ఉందా? చనిపోయిందా? ఇదొక్క విషయం చెప్పండి. ఎందుకంటే అమ్మను చంపేశారని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. బతికి ఉండి మా వద్దకు వస్తే చాలా సంతోషం. రాకపోయినా ఫర్వాలేదు. బతికి ఉందని తెలిస్తే చాలు. అమ్మ... అప్పటి అమ్మ కాదని మరిచిపోతాం. లేదు చంపేశారా! అదైనా చెప్పండి. రోజూ వేదనపడకుండా ‘అమ్మలేదు ఎంత బాధపడినా రాదు’ అని నాన్నను ధైర్యంగా చూసుకుంటాం. ఆయన ఒడిలో మరింత ధైర్యంగా బతుకుతాం. ‘ఎస్పీ రాజశేఖర్‌బాబు మంచి ఆఫీసర్ అని, అందరికీ న్యాయం చేస్తార’ని అంతా అనుకుంటున్నారు. పేపర్లో ఇటీవల మీ ఇంటర్వ్యూ కూడా చూశాం. ఏ సమస్య ఉన్నా చిన్న ఎస్ఎంఎస్ పంపండి స్పందిస్తాం అని చెప్పారు. ఇదంతా ఎస్ఎంఎస్ పంపడం చేతకాదు. రెండు చేతులు జోడించి మేం వేడుకుంటున్నాం. మా అమ్మ సంగతి తేల్చరూ.. ప్లీజ్ అంకుల్.. ప్లీజ్..’