8 నెలల తర్వాత దొరికిన 'డీజిల్'
8 నెలల తర్వాత దొరికిన 'డీజిల్'
Published Fri, Sep 30 2016 2:46 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
లండన్: ఇంటి నుంచి తప్పిపోయిన ఓ కుక్క ఆచూకీ 8 నెలల తర్వాత దొరికింది. ఇంగ్లండ్ లోని సల్ఫోర్డ్ లో చెందిన ఓ మహిళ పెంపుడు కుక్క డీజిల్ గత ఫిబ్రవరిలో కపిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎంత వెతికినా డీజిల్ జాడ తెలియలేదు. అయితే గతవారం ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ ఎయిర్ పోర్టలోని టెర్మినల్ లో డీజిల్ ను కనుగొన్నారు పోలీసులు.
టెర్మినల్ లో కుక్క ఉండటాన్ని గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కుక్కను వెంబడించి అతికష్టం మీద పట్టుకున్నారు. కుక్కకు ఉన్న మైక్రోచిప్ ఆధారంగా దాని యజమానిని కనుగొన్న పోలీసులు అసలు విషయాన్ని తెలియజేశారు.
'ఎనిమిది నెలల కిందట అంటే గత ఫిబ్రవరిలో గార్డెన్ నుంచి డీజిల్ తప్పిపోయింది. అప్పటి నుంచి దాని ఆచూకీ తెలియలేదు. గతవారం ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ లో డీజిల్ ను కనుగొన్నారు సిబ్బంది. మాంచెస్టర్ విమానాశ్రయానికి 25 కిలో మీటర్ల దూరంలోని సల్ఫోర్డ్ పట్టణం ఉంటుంది. కానీ డీజిల్ ఎయిర్ పోర్టుకు ఎలా వచ్చిందో తెలియదు. డీజిల్ మాకు కనిపించేటప్పటికి పూర్తి ఆరోగ్యంగా ఉంది. మాతో డీజిల్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. వెంటనే మైక్రోచిప్ ఆధారంగా యజమానిని గుర్తించాం. బహుశా ఈ ఎనిమిది నెలలు డీజిల్ హాలిడే లో ఉన్నట్టుంది' అని ఎయిర్ పోర్టు పోలీస్ అధికారి సార్జంట్ స్టీవెన్ జేమ్సన్ తెలిపారు.
అయితే అత్యంత సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులోకి కుక్క ఎలా వచ్చింది అనే విషయం తెలియరాలేదు. కాగా 8 నెలల తర్వాత డీజిల్ ను చూసిన యజమాని.. ఆనందంతో కంటతడి పెట్టింది. అదే విధంగా చాలా కాలం తర్వాత యజమానిని చూసిన కుక్క కూడా అంతే అప్యాయంగా మెలిగింది.
Advertisement
Advertisement