
బికినీ షోలకు ఓకేచెప్పి.. 'హోదా'కు నో అంటారా?
తిరుమల: ప్రత్యేక హోదా ఆందోళనలపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా తప్పుబట్టారు. వైజాగ్ బిచ్‌లో బికినీ షోలకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరసన తెలుపుతామంటే అనుమతి ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అయితే, కమీషన్లు దండుకోవచ్చునని ప్రభుత్వం చూస్తున్నదని, అందుకే హోదాను కాదని, ప్యాకేజీని కోరుకుంటున్నదని ఆమె మండిపడ్డారు.