మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్ | modi can'tbe held responsible for bihar election | Sakshi
Sakshi News home page

మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్

Published Sun, Nov 8 2015 3:18 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్ - Sakshi

మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని బాధ్యుణ్ని చేయలేమని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్‌ఎస్పీ, హెచ్‌ఏమ్ పార్టీలతో కూడిన ఎన్డీయే ఓటమి ఖరారైన నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమికి ప్రధాని మోదీని బాధ్యత వహించాలనడం సరికాదని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బిహార్ ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమికి ఆయన బాధ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి భారీ విజయాన్ని సాధించడంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement