chirag pawsan
-
కేంద్ర మంత్రి ఆప్తుడి ఇంట ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్లో ఎల్జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.ఏమీటా కేసు..2012 జూన్ 1వ తేదీన రణ్వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా! -
ఎస్సీ వర్గీకరణ: ‘సుప్రీం కోర్టు తీర్పును అప్పీల్ చేస్తాం’
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, నేతలు స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ‘లోక్ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్) నేత, కేంద్ర మంత్రిమంత్రి చిరాగ్ పాశ్వాన్ మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. అదీకాక సుప్రీం కోర్టు తీర్పును సర్వొన్నత న్యాయస్థానంలోనే అప్పీలు చేయనున్నామని అన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘‘అంటరానితనాన్ని ప్రాతిపదికగా తీసుకుని అణగారినవర్గాలను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చారు. అయితే ఎస్సీ, ఎస్టీలో ఉప వర్గీకరణ వల్ల ఎటువంటి ప్రయోజనం జరగదు. ఈ వర్గాలు ఎదుర్కొన్నే అంటరానితనం అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తవించలేదు. విద్యాఅవకాశాలు ఉన్న దళితులు, ధనవంతులు సైతం ఎస్సీల్లో పలు వర్గాలు ఇప్పటికీ కొన్నిచోట్ల అంటరానితనాన్ని ఎందుర్కొంటున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం సరికాదు. ఈ తీర్పును సమీక్షించి, సుప్రీం కోర్టులోనే అప్పీలు చేయనున్నాము’అని చిరాగ్ అన్నారు.सुप्रीम कोर्ट के दलित - आदिवासी के कोटे के अंदर कोटे के फ़ैसले के ख़िलाफ़ केंद्रीय मंत्री @iChiragPaswan की पार्टी पुनर्विचार याचिका दाखिल करेगी । चिराग़ ने साफ़ किया कि दलितों - आदिवासियों को आरक्षण छूआछूत के आधार पर मिला हैं @ndtv @ndtvindia pic.twitter.com/8V2oBGwaQD— manish (@manishndtv) August 3, 2024 అదేవింధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. కులగణనకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. దళితుల కోటాలో క్రీమీలేయర్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందనని తెలిపారు. -
కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. ‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. .. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. -
Chirag Vs Pashupati: అబ్బాయి వర్సెస్ బాబాయి
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్‌లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుంది. పాశ్వాన్ ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా నెగ్గిన హాజీపూర్ లోక్‌సభ స్థానంలో ఈసారి వారిద్దరూ నేరుగా అమీతుమీ తేల్చుకోనున్నారు... పాశ్వాన్ల కంచుకోట హాజీపూర్ లోక్‌సభ స్థానంతో పాశ్వాన్‌లది విడదీయరాని బంధం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ 1977 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. మధ్యలో 1984, 2009 మినహా మరో ఏడుసార్లు హాజీపూర్ నుంచే నెగ్గారు. ఆనారోగ్య కారణాలతో పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లడంతో తమ్ముడు పశుపతి 2019లో తొలిసారి హాజీపూర్ నుంచి పోటీ చేసి నెగ్గారు. చిరాగ్ 2014తో పాటు 2019లోనూ జముయ్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. 2020లో పాశ్వాన్ మృతి చిరాగ్, పశుపతి మధ్య వారసత్వ పోరుకు దారితీసింది. పాశ్వాన్ వారసుడిని తానేనని పశుపతి ప్రకటించుకోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని చిరాగ్ హెచ్చరించారు. పశుపతి మిగతా నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి తిరుగుబావుటా ఎగరేయడంతో వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. చివరికి వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఎల్జేపీ పేరును, పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేసి పశుపతి వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ), చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్) పేర్లు కేటాయించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పశుపతి 2021లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. చిరాగ్ ఇన్, పశుపతి ఔట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో 40 స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేయడం లక్ష్యం పెట్టుకున్న బీజేపీ మరోసారి చిరాగ్‌ను చేరదీసింది. అలా మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్, పొత్తులో భాగంగా తమకు కేటాయించే 5 స్థానాల్లో హాజీపూర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. దాంతో పశుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనికి తోడు ఆర్ఎల్జేపీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వారం క్రితం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను హాజీపూర్ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మిగతా నలుగురు ఎంపీలు కూడా మళ్లీ బరిలో దిగి తీరతారని స్పష్టం చేశారు. బాబాయిని ఓడిస్తే పాశ్వాన్ల కంచుకోటైన హాజీపూర్ హస్తగతమవడమే గాక తండ్రి వారసత్వం పూర్తిగా తనదేనని రుజువవుతుందనే భావనతో చిరాగ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. హాజీపూర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. దీనికి తోడు 1.5 లక్షల దాకా ముస్లిం ఓట్లున్నాయి. యాదవులు, రాజ్‌పుత్‌లు, భూమిహార్లతో పాటు కుషా్వహాలు, పాశ్వాన్లు, రవిదాస్ వంటి అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గాలకు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుంది. ఈ వర్గాలకు రాం విలాస్ పాశ్వాన్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1977లో ఆయన సాధించిన 4.69 లక్షల మెజారిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది! 1989లో ఏకంగా 5 లక్షల పై చిలుకు మెజారిటీ సాధించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్‌లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్‌కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్‌తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్‌లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్‌కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్‌ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్‌ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్‌ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మోదీది బాధ్యత కాదు: చిరాగ్ పాశ్వాన్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని బాధ్యుణ్ని చేయలేమని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏమ్ పార్టీలతో కూడిన ఎన్డీయే ఓటమి ఖరారైన నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమికి ప్రధాని మోదీని బాధ్యత వహించాలనడం సరికాదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బిహార్ ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమికి ఆయన బాధ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి భారీ విజయాన్ని సాధించడంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.