మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలను గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఆదివారం అభినందనలతో ముంచెత్తారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం పట్ల చౌహాన్ను ప్రశంసలతో ముంచెత్తారు. చౌహాన్ విజయం అసలు సిసలు విజయానికి ప్రతీకగా మోడీ అభివర్ణించారు. రాష్ట్రంలో చౌహాన్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కృతకృత్యులయ్యారని మోడీ కీర్తించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రాజస్థాన్ ఆ కోటను బీజేపీ ఓట్లతో కొల్లగొట్టం చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఈ సందర్బంగా రాజస్థాన్ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే సింధియాకు ఆయన అభినందనలతో ముంచెత్తారు.రాజస్థాన్లో అసమర్థ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడటంలో వసుంధరా రాజే విజయం సాధించారని మోడీ ప్రశంసించారు.