ఇన్సూరెన్సు సొమ్ము కోసం.. కొడుకు హత్య! | monster mother kills son for insurance amount | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్సు సొమ్ము కోసం.. కొడుకు హత్య!

Published Mon, Aug 10 2015 6:48 PM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

ఇన్సూరెన్సు సొమ్ము కోసం.. కొడుకు హత్య! - Sakshi

ఇన్సూరెన్సు సొమ్ము కోసం.. కొడుకు హత్య!

ఇన్సూరెన్సు డబ్బు కోసం.. కొడుకును, అది కూడా పాక్షికంగా వికలాంగుడైన కొడుకును ప్రియుడితో కలిసి చంపేసిందో సవతి తల్లి. ఈ దారుణం మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. చైతన్య బాల్పాండే (13) అనే యువకుడిని ఆమె తల్లి కొట్టి చంపేసింది. అతడి పేరు మీద ఉన్న రూ. 10 లక్షల బీమా పాలసీ కోసమే అతడి తల్లి రాఖీ బాల్పాండే (36) చంపేసి ఉంటుందని పోలీసులు విచారణ అనంతరం అనుమానిస్తున్నారు. చైతన్యను తన అదుపాజ్ఞల్లో పెట్టుకోడానికి తరచు అతడిని కొట్టేదని చుట్టుపక్కల వాళ్లు కూడా చెబుతున్నారు. సరిగా తిండి పెట్టేది కాదని, నాలుగేసి గంటల పాటు వ్యాయామం చేయమనేదని, రాత్రి కూడా చాలాసేపు నిలబెట్టి ఉంచేదని చెప్పారు. ఇదంతా చూసిన పొరుగింటి మహిళ ఒకరు అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా.. 'నీ భర్తపై రేప్ కేసు పెడతా' అని బెదిరించి ఆమెను తరిమేసింది.

రాఖీ భర్త, చైతన్య తండ్రి తరుణ్ కూడా ఇప్పుడు ఆమెతో ఉండటం లేదు. అయితే ఆయన చైతన్య పేరుమీద పది లక్షల రూపాయలకు బీమా పాలసీ చేయించారు. దాంతో అతడిని చంపేసి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి ఆ డబ్బు తీసుకోవాలన్నది రాఖీ కుట్ర అని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సూర్యకాంత్ మారోడ్ చెప్పారు. పాలసీలో నామినీగా తన పేరు బలవంతంగా రాయించుకుందని, ఆ తర్వాత తన ప్రియుడు సుమిత్ మోరేతో కలిసి చైతన్యను చంపేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement