రాగల 24 గంటల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షం
ఒడిశాలో రాగల 24 గంటల్లో దాదాపు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడునున్నాయి. వీటితోపాటు రాగల 48 గంటల్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు అధికంగా ఉన్నాయి.
ఒడిశాలో ఈ రోజు తెల్లవారుజామున గాలులు ప్రచండ వేగంతో వీస్తున్నాయి. అయితే ఆ గాలుల వేగం ఈ రోజు సాయంత్రానికి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కాగా ఆ గాలుల వల్ల పాకలు, పురి గుడిసెలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే విద్యుత్, సమాచార వ్యవస్థలు మరింతంగా దెబ్బతింటుంది. వీటితోపాటు రవాణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థం అవుతుంది. విపరీతమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పంట పోలాలు నీటి మునగనున్నాయి.