కీలక సమావేశం వాయిదా: ఢిల్లీకి ములాయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మంగళవారం పార్టీ జాతీయ సమావేశం నిర్వహించి, అఖిలేశ్ వర్గానికి ముకుతాడు వేయాలనుకున్న ములాయం.. సదరు సమావేశాన్ని జనవరి 5కు వాయిదా వేసినట్లు ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ మీడియాకు సమాచారం అందించారు. ములాయం నమ్మినబంటు అమర్‌సింగ్ లండన్ నుంచి తిరిగి రావాల్సి ఉంన్నందునే సమావేశం వాయిదపడినట్లు సమాచారం. (ఆత్మరక్షణలో ములాయం.. ఈసీ కోర్టులో ‘ఎస్పీ’ బంతి)
ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురైన ములాయంకు వైద్యులు ఇంట్లోనే చికిత్స అందించారు. కాస్త కోలుకున్న ఆయన తమ్ముడు శివపాల్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నానికి లక్నో నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళతారు. మరోవైపు ములాయం అనుమతి లేకుండానే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్ యాదవ్.. 'సైకిల్' గుర్తుపైనే గురిపెట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సస్పెన్షన్ వివాదం సద్దుమణిగి 24 గంటలు తిరగకముందే పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న అఖిలేశ్ చర్యతో ఆత్మరక్షణలోపడ్డ ములాయం న్యాయం చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. గడిచిన కొన్ని నెలలుగా పార్టీలో కొనసాగుతున్న విబేధాలు టికెట్ల పంపకాల పర్వం మొదలైననాటి నుంచి తీవ్రస్థాయి చేరుకోవడం తెలిసిందే. (పార్టీని స్వాధీనపర్చుకున్న అఖిలేశ్ యాదవ్)
యూపీ పరిణామాలకు సంబంధించిన మరిన్ని కథనాలివి..
1. ములాయం సింగ్కు అస్వస్థత
2. అలా చేయక తప్పలేదు : అఖిలేష్ యాదవ్
3. బాబాయ్ నేమ్ ప్లేట్‌ను పీకేశారు
5. దయచేసి నన్ను బతకనీయండి: అమర్ సింగ్