రైతు కుటుంబాలకు నానాపటేకర్ సాయం | Nana Patekar Donated Money To The Families Of Farmers | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాలకు నానాపటేకర్ సాయం

Published Mon, Sep 7 2015 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

రైతు కుటుంబాలకు నానాపటేకర్ సాయం - Sakshi

రైతు కుటుంబాలకు నానాపటేకర్ సాయం

113 కుటుంబాలకు చెరో రూ.15,000 అందజేత
లాతూర్: కరువు, అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ రూ.15,000 చొప్పున నగదు సాయం అందించారు. శనివారం ఇక్కడ మొత్తం 113 కుటుంబాలకు నటుడు మకరంద్ అనాస్‌పురెతో కలసి చెక్కులిచ్చారు.  మహారాష్ట్రలోని మరాఠాడ్వా ప్రాంతంలోని లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో కరువు కన్నెర్రజేసిందని పటేకర్ అన్నారు. ‘శరద్ పవార్,  దేవేంద్ర ఫడ్నవిస్ వంటి రాజకీయ నేతలు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నాను. నా ఆశ తీరుతుందో లేదో తెలి యదు’ అని అన్నారు. గత నెలలోనూ విదర్భ లో పటేకర్ 62 కుటుంబాలకు రూ.15,000 చొప్పున నగదు సాయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement