ఇస్లామాబాద్: ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్–పాకిస్తాన్ ప్రధానులు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియా తెలిపింది.
కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జూన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్‌సీఓ) సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలకు అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలను ఊటంకిస్తూ పాక్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక పేర్కొంది. భారత్–పాక్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని మిగతా ఎస్‌సీఓ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు ట్రిబ్యూన్ వెల్లడించింది.
జూన్‌లో భారత్–పాక్ ప్రధానుల భేటీ!
Published Tue, Apr 18 2017 10:22 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM
Advertisement