మోదీ ఛాతీ 5.6 అంగుళాలకు తగ్గింది! | narendra Modi's chest is 5.6 inches and not 56, Cong on ceasefire | Sakshi
Sakshi News home page

మోదీ ఛాతీ 5.6 అంగుళాలకు తగ్గింది!

Published Tue, Oct 7 2014 11:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోదీ ఛాతీ  5.6 అంగుళాలకు తగ్గింది! - Sakshi

మోదీ ఛాతీ 5.6 అంగుళాలకు తగ్గింది!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ బలగాలు వరుసగా భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూ ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేతలుడిగి చూస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత వారం రోజుల్లో పాకిస్తాన్ 19 సార్లు కాల్పులకు పాల్పడితే ప్రధాని మోదీ నిమ్మకుండు పోయారని దుయ్యబట్టింది. మంగళవారం ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ పొరుగు దేశం పాకిస్తాన్ పై మోదీ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గత సాధారణ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ తన ఛాతీ 56 అంగుళాలుగా చెప్పుకున్నసంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

ప్రస్తుతం మోదీ ఛాతీ 56 నుంచి 5.6 అంగుళాలకు తగ్గిందంటూ చురకలంటించారు. ఎన్నికల ట్వీట్లతోనే కాలం గడుపున్న మోదీ.. దేశ పౌరులు మరణిస్తున్నా పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గు చేటన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశమని అహ్మద్ స్పష్టం చేశారు. గత యూపీఏ హయాంలో ఇదే అంశాన్ని మోదీ పదేపదే లేవనెత్తారని.. ఇప్పడు ఆయన వరకూ వచ్చే సరికి మౌనంగా ఉండి పోయారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement