న్యూఢిల్లీ: స్వదేశీ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీలు లేదా వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించే కంపెనీలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన అణుధార్మికత నిబంధనలకు అనుగుణంగా సెల్‌ఫోన్లు ఉండేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. ఒక వినియోగదారుడు ఒకవేళ ఆరు నిమిషాలపాటు సెల్‌ఫోన్‌ను వాడితే దాన్నుంచి వెలువడే అణుధార్మికత ప్రభావం ఒక గ్రాము మానవ కణజాలంపై 1.6 వాట్లు మించరాదని టెలికంశాఖ నూతన నిబంధనల్లో పేర్కొంది.