
'మనసులో మాట'కు మార్గం సుగమం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మనసులో మాట'కు ఎన్నికల సంఘం మార్టగం సుగమం చేసింది. 'మన్ కీ బాత్' కార్యక్రమం రేడియో ప్రసారానికి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. 'మన్ కీ బాత్'లో బిహార్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించవద్దని కోరింది. బిహార్ లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా మాట్లాడవద్దని ప్రధానికి సూచించింది. ఈనెల 20న 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రసారం కాకుండా చూడాలని విపక్షాలు ఈసీని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, బిహార్ నుంచి వచ్చే, వెళ్లే ప్రత్యేక రైళ్లకు తమ అనుమతి లేకుండా ప్రత్యేక రాయితీ ఇవ్వొద్దని రైల్వేశాఖను ఈసీ ఆదేశించింది.