
అభిప్రాయమే, ఓటింగ్ ఉండబోదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో చర్చ ప్రారంభం కావడం చాలా సంతోషకర పరిణామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. బిల్లును కేవలం అభిప్రాయం కోసమే పంపామని ఆయన వెల్లడించారు. ఆమోదం కోసమో, తిరస్కారం కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై ఓటింగ్ ఉండబోదన్నారు. బిల్లును తిరస్కరించే అధికారం అసెంబ్లీకి లేదని దిగ్విజయ్ చెప్పారు.
తీవ్ర గందరగోళం, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ‘సమైక్య’ ఆందోళన మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ బుధవారం శాసనసభలో చర్చ ప్రారంభించారు.