చెన్నై:ఈశాన్య రుతుపవనాల రాకతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల బలపడినందున తమిళనాడుతోపాటు, పాండిచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నాయని తెలిపింది. శనివారం ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
దీంతో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో గత 24 గంటల్లో చెన్నైలో 18 సెంమీ వర్షపాతం నమోదు కాగా, తిరునేళ్ వేళి జిల్లా పాపనాశంలో 16 సెం.మీ వర్షపాతం నమోదైంది.