న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు అక్కడ నుంచే ఓటేసే అవకాశం ఏర్పడనుంది. ఈ కొత్త ఆవిష్కరణకు బీహార్ ఎన్నికల వేదిక అవనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది చివరిలో బీహార్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనే ఎన్నారైలకు ఓటు వేసే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించిన ఎన్నికలుగా బీహార్ ఎన్నికలు నిలవనున్నాయి.
దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ న్యాయమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతుంది. ఇది ఎంతమేరకు విజయవంతమవుతుందో అనే అంశాన్ని పరిశీలించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించాలనుకుంటున్న ఎన్నికల కమిషన్.. అందుకు బీహార్ ఎన్నికలను ఎంపిక చేసుకొంది. ఈ ఏడాది నవంబర్ 29న బీహార్ ఎన్నికలు జరగనుండగా.. ఇందులో ఓటు వేసేందుకు దాదాపు వెయ్యిమంది బీహార్ ఎన్నారైలు ఓటు హక్కుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఎన్నారైలకు కూడా ఓటు..!
Published Mon, Apr 13 2015 2:13 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement