బహుముఖ నటుడికి నివాళి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఓం పురి (66) హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. విలక్షణమైన పాత్రలల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న తమ సహనటుడు ఇక లేరన్న వార్తతో యావత్తు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వసుంధర రాజే సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పలువురు సీనియర్ నటీ నటులు, దర్శకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓంపురి మరణంపై ట్విట్టర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెడ్ మీద ఆయన అలా ప్రశాంతంగా నిశ్చలంగా పడి వుండటాన్ని నమ్మలేకపోతున్నానంటూ సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన నటుడ్ని కోల్పోయామొంటూ కరణ్ జోహార్ ట్విట్ చేశారు. అంతర్జాతీయ సినిమాలకు పనిచేసిన తొలినటుడు అంటూ గుర్తుచేసుకున్న ప్రముఖ నటి, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి సంతాపం ప్రకటించారు. తన అసమాన నటనతో మనల్ని నవ్వించారు, ఏడ్పించారు. ఆయన జీవితపరమార్థాన్ని ఎరిగిన వారన్నారని పేర్కొన్నారు. థియేటర్, సినీ లోకానికి, ఆయన లేని లోటు పూడ్చలేనిదని కిరణ్ మజుందార్ షా సంతాపం తెలిపారు. ఇంకా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, తదిరులు సంతాపం తెలిపిన వారిలోఉన్నారు.
కాగా బహుముఖ నటుడు ఓంపురి శుక్రవారం ఉదయం ఆయన తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. భారతీయ సినిమాలతో పాటు పాకిస్తానీ తదితర విదేశీ సినిమాల్లో నటించిన ఆయన విలక్షణ ప్రాతలతో సినీ విమర్శకుల ప్రశంసలతో బలు అవార్డులను కూడా అందుకున్నారు. హర్యానాలోని అంబాలో 18 అక్టోబర్ 1950 లో పుట్టిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మరో సీనియర్ నటుడు, దివంగత అమ్రేష్ పురి, ఓంపురి సోదరుడు.
Solid actor....Solid filmography....immense talent.... #RIPOmPuri ....cinema has truly lost a brilliant artist....
— Karan Johar (@karanjohar) January 6, 2017