కేజీ-డీ5లో ఓఎన్‌జీసీ 40 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ బ్లాక్ కేజీడీ5లో గ్యాస్, చమురు నిక్షేపాల అభివృద్ధి కోసం రూ. 40,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 2018-19 నాటికల్లా ఉత్పత్తి సాధించే దిశగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్ దినేష్ కె. సరాఫ్ గురువారం తెలిపారు. ఒకే ప్రాంతంలో ఇంత అత్యధిక పెట్టుబడిని ఓఎన్‌జీసీ ప్రతిపాదించడం ఇదే ప్రధమం. ఇందుకు సంబంధించి క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్‌డీపీ)ని ఈ ఆర్థిక సంవత్సరం రె ండో త్రైమాసికంలోగా ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వివరించారు.