వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ | Opinion poll: Congress emerges as largest party in Punjab | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్

Published Fri, Oct 14 2016 11:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్

చండీగఢ్: వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమికి పరాజయం తప్పదా? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీ సాధించే అవకాశం లేదా? యాక్సిస్-ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం పంజాబ్లో హంగ్ ఏర్పడనుంది. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం అకాలీదళ్కు 56, బీజేపీకి 12 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 46 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర సభ్యులున్నారు.

యాక్సిస్-ఇండియా టుడే ఒపీనియల్ పోల్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. కాంగ్రెస్కు 49 నుంచి 55 సీట్లు రావచ్చు. అయితే గత ఎన్నికల కంటే కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ (59) సాధించకపోవచ్చు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంది. ఆప్ 42-46 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలవవచ్చు. కాగా అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి కేవలం 17 నుంచి 21 సీట్లు గెలిచే అవకాశముందని సర్వేలో తేలింది. ఇతర పార్టీలు 3 నుంచి 7 సీట్లు గెలవవచ్చు. ఇక బీజేపీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. రైతుల ఆత్మహత్యలు, డ్రగ్స్ అక్రమ సరఫరా వంటి అంశాలు అధికార కూటమిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement