'వెల్ నుంచి వెళ్లకుంటే సస్పెండ్ చేస్తా'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర సభ్యులు రాజ్యసభలో ఆందోళన కొనసాగిస్తుండడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విభజన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సభ ఐదుసార్లు వాయిదా పడింది. వెల్లో నిరసన తెల్పుతున్న సీమాంధ్ర సభ్యులపై డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేపదే వెల్లోకి వచ్చి నిరసన తెల్పుతున్న సుజనా చౌదరికి కురియన్ వార్నింగ్ ఇచ్చారు. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ
సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో ఏం చర్చించాలనేది నిర్ణయించవలసింది మీరు కాదని చౌదరితో అన్నారు. మీరు అప్రజాస్వామికంగా వ్యహరిస్తున్నారంటూ డిప్యూటీ చైర్మన్పై చౌదరి విమర్శించారు. దీంతో ఆగ్రహించిన కురియన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. వెల్ నుంచి వెళ్లకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీంతో సుజనా చౌదరి వెనక్కి తగ్గారు.