pj kurien
-
9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ నెల 8 సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు, ప్రభాత్ ఖబర్ హిందీ పత్రిక ఎడిటర్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల తేదీల్ని వెంకయ్య ప్రకటించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రాంగణంలోని కాంగ్రెస్ నేత ఆజాద్ చాంబర్లో భేటీఅయ్యాయి. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలన్న అంశంపై చర్చించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సభలో బలాబలాలెంత: ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
ఏకాభిప్రాయానికి రావాలి
న్యూఢిల్లీ: రాజ్యసభకు తదుపరి డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఏకాభిప్రాయానికి రావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివారం కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఆదివారం పదవీ విరమణ పొందిన పీజే కురియన్‌కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య ఈ విజ్ఞప్తి చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి పార్టీలకతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ ‘తదుపరి డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఉండాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కురియన్ తనకు మంచి సహోద్యోగిగా ఉన్నారనీ, ఎంతో ఉత్సాహంతో సభను నడిపేవారని వెంకయ్య కొనియాడారు. అనంతరం కురియన్ మాట్లాడుతూ పెద్ద ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఇరుపక్షాలు కలసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప అస్తమానం సభా కార్యకలాపాలకు అడ్డుతగలకూడదని హితవు చెప్పారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, విజయ్ గోయెల్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
‘రాజ్యసభను వృద్ధాశ్రమంగా మార్చవద్దు’
తిరువనంతపురం : రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పీజే కురియన్ రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాని కేరళ యువ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల(జూన్)లో కేరళకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కురియన్ రీ నామినేషన్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘రాజ్యసభ సభ్యునిగా మూడుసార్లు ఎన్నికైన పీజే కురియన్ ఈసారి తెలివైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. పార్లమెంటరీ రాజకీయాల నుంచి వారు వైదొలుగుతారని భావిస్తున్నాను’ అంటూ కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరాం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బలరాం అభిప్రాయంతో ఏకీభవించిన మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కురియన్ రీ నామినేషన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఎగువ సభ(రాజ్యసభ)ను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదు. కురియన్ వంటి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకుని ఉంటాయని రాహుల్ చెప్పారంటూ’ యువ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీజే కురియన్.. ‘అధిష్టానం కోరుకున్నట్లయితే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానం’టూ వ్యాఖ్యానించారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో తగినంత బలం లేదు. చెంగనూర్ ఓటమికి కారణం ఎవరు..? మే 31న వెలువడిన చెంగనూర్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ చీఫ్‌ను మార్చాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కేరళ కాంగ్రెస్ చీఫ్ ఎంఎం హసన్‌తో పాటు సీనియర్ నేతలు వీడీ సతీషన్, మాజీ ఎంపీ కె. సుధాకరన్, మాజీ మంత్రి ముల్లపల్లి రామచంద్రన్ కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవి రేసులో ముందున్నారు. -
41 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌యేతర డిప్యూటీ చైర్మన్..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఎగువసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈ ఏడాది జులైలో రిటైర్ కానున్నారు. దీంతో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కోల్పోయే అవకాశం ఏర్పడింది. 1977 నుంచి కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన వ్యక్తులే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. 1977లో కాంగ్రెస్ నాయకుడు రామ్ నివాస్ మిర్ధా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. కాంగ్రెస్ చేతుల్లో నుంచి ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదవులు పోయాయని, భవిష్యత్‌లో ఓ నాన్ కాంగ్రెస్ ఎంపీనే ఎగువ సభ డిప్యూటీ చైర్మన్ అవుతారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నాయకులు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, కురియన్ తర్వాత డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయేకు చెందిన వ్యక్తిని కూర్చుబెట్టడం అంత సులువేమీ కాదు. అందుకు సరిపడా నంబర్ ఎన్డీయే వద్ద లేదు. సంపద్రాయబద్దంగా అయితే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదవులను అధికార పక్షానికి చెందిన వ్యక్తులు, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ పదవులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల నిర్వహిస్తారు. అయితే, రెండు పదవులను తమ వద్దే ఉంచుకునేందుకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. దీంతో ఎన్డీయే కూడా అలానే చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ యేతర వ్యక్తికే డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. -
'ట్రావెల్ బ్యాన్ పవర్ విమాన సంస్థకు లేదు'
న్యూఢిల్లీ: విమానంలోగానీ, ఎయిర్‌పోర్ట్‌లోగానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం సదరు విమానాయాన సంస్థకు లేదని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ అన్నారు. చట్టప్రతినిధులు కూడా పౌరులతోనే సమానం అని వారేదైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. గురువారం రాజ్యసభలో ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్ ఇండియా వంటి పలు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని, అసలు ఆ సంస్థలు అలా చేయొచ్చా అని కురియన్ను వివరణ కోరారు. దీనికి స్పందించిన కురియన్.. అగర్వాల్ చాలా విలువైన పాయింట్ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్ ఇండియా కానీ, మరింకేదైనా విమానయాన సంస్థకు గానీ అలాంటి అధికారం లేదని అన్నారు. 'ఏ ఒక్కరిని శిక్షించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఏ ఎంపీ అయినా నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలిగానీ, విమానాయాన సంస్థకాదు' అని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ జోక్యం చేసుకోని నేరాలనే మాట ఉపయోగించకుండా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ ఉల్లంఘనలు అనే పదం ఉపయోగించాలని కోరారు. అయితే, ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొట్టినప్పుడు నేరం అవుతుంది కదా అని వివరణ ఇచ్చారు. ఇటీవల ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అంతకుముందు శివసేన పార్టీ నేతలపై ఎయిర్ ఇండియాతోపాటు పలు విమాన సంస్థలు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. -
జయలలిత కోసం ఇందిరా గాంధీ వచ్చారు
న్యూఢిల్లీ: జయలలిత మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. 1984లో రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయలలిత జ్ఞాపకాలను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ గుర్తుచేసుకున్నారు. ఆ ఏడాది రాజ్యసభలో జయలలిత ప్రసంగించారని చెప్పారు. జయలలిత ప్రసంగం వినడం కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభకు వచ్చారని కురియన్ వెల్లడించారు. రాజ్యసభలో జయలలిత ప్రసంగించడం అదే తొలిసారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను లోక్‌సభ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. ‘జయలలిత ప్రసంగించినపుడు గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. ఆమె ప్రసంగానికి సభికులు ముగ్ధులయ్యారు. అందరూ ఆమెను అభినందించారు. ఆ రోజు ఆదో పెద్ద వార్త అయ్యింది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన జయలలిత అంత అద్భుతంగా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రజల హృదయాల్లో జీవించిన నాయకురాలు ఆమె. పేద ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు’ అని కురియన్ అన్నారు. -
మీరు అంతర్జాతీయ పౌరుడు!!
-
మీరు అంతర్జాతీయ పౌరుడు!!
సాధారణంగా ఎప్పుడూ బెత్తం పట్టుకుని అదిలించే హెడ్మాస్టారిలా వ్యవహరించే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారం మాత్రం కాస్తంత సరదాగా కనిపించారు. సభ్యులను కాస్త అదిలిస్తూనే... సీనియర్లతో మాత్రం జోకులు వేశారు. అరుణ్ జైట్లీ చర్చకు సమాధానం ఇస్తుండగా మధ్యలో అడ్డుకుని మాట్లాడుతున్న సుజనా చౌదరిని మందలిస్తూ.. ఒక మంత్రి మాట్లాడుతుంటే మరో మంత్రి అడ్డుకోవడం ఏంటని చిన్నగా మొట్టికాయలు వేశారు. ఇక సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడినప్పుడు.. తాను మద్రాసులో పుట్టానని, ఆంధ్రాలో పెరిగానని, తెలంగాణతోనూ అనుబంధం ఉందని, అందువల్ల తెలుగు రాష్ట్రాల విషయంలో తన సూచనలను పట్టించుకోవాలని అన్నారు. దాంతో స్పందించిన కురియన్.. ఏచూరిని ప్రత్యేకంగా సంబోధిస్తూ, ‘‘మీరు జాతీయ, ఇంకా మాట్లాడితే అంతర్జాతీయ పౌరులు. మీరు ఏ విషయం గురించైనా మాట్లాడొచ్చు. మీకు రాష్ట్రాల పరిమితులు లేవు. ఏ రాష్ట్రం, ఏ అంశంపై అయినా మాట్లాడొచ్చు’’ అని నవ్వుతూ చెప్పారు. దీంతో సీతారాం ఏచూరితో పాటు సభ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. -
హింసను వీడితేనే చర్చలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులు హింసను వీడితే వారితో రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. వామపక్ష తీవ్రవాదం దేశానికి సవాలుగా మారిందని, హింసకు పాల్పడితే ఎవరినైనా సహించేది లేదని చెప్పారు. సోమవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అయితే ఎనిమిది గంటల పాటు కొనసాగిన చర్చకు రాజ్‌నాథ్ రెండున్నర గంటల పాటు సమాధానమివ్వడం సభ్యులను అసహనానికి గురిచేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కలుగజేసుకుని ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించినా.. సభ్యులందరి ప్రశ్నలకు జవాబివ్వాలంటూ తన సమాధానం కొనసాగించారు. చివరికి రాత్రి 9.30 గంటలకు రాజ్‌నాథ్ సమాధానం ముగిసింది. -
పెద్దల సభలో చిరంజీవికి భంగపాటు!
మెగాస్టార్ గా తెలుగు సినీ తెరపై తనదైన శైలిలో డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి పెద్దల సభలో చేదు అనుభవం ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం దారుణమైన ఓటమి పాలైన తర్వాత మాజీ కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ పై తన గళాన్ని వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాట్లాడేందుకు రాజ్యసభలో మూడు నిమిషాల పాటు సమయాన్ని చిరంజీవికి డిప్యూటీ చైర్మన్ కురియన్ కేటాయించారు. అయితే తనకు కేటాయించిన సమయాన్ని మించి ఏడు నిమిషాలపాటు ఏకధాటిగా తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ ను చదువుతుండగా కురియన్ ముగించాలని పదే పదే కోరారు. అయితే కురియన్ విజ్క్షప్తిని పట్టించుకోకుండా అదేపనిగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిరంజీవి చదివే తీరును కురియన్ అనుకరించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. అంతేకాకుండా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతున్నారని, సభలో గౌరవ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదని కురియన్ వ్యాఖ్యానించారు. కురియన్ స్పందనతోకొద్దిసేపు చిరంజీవి తికమకపడ్డనట్టు కనిపించారు. అయితే సర్దుకుని ప్రసంగాన్ని ముగించి.. తనకు సమయాన్ని కేటాయించినందుకు సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం తెలిసిందే. అలాగే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అధికార పార్టీ సభ్యులే అడ్డుపడితే ఎలా?
సభలో సాధారణ పరిస్థితి కొనసాగేలా డిప్యూటీ చైర్మన్ చూడాలని, అప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు గురించిన సమగ్ర చర్చ జరిగేందుకు వీలుంటుందని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు సూచించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆయనను కోరినప్పుడు వెంకయ్యనాయుడు లేచి నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వెల్‌లో అప్పటికే ఉన్న సీమాంధ్ర ఎంపీలు, తమిళనాడు ఎంపీలు తమ నినాదాలు కొనసాగించడంతో ఆయన మాట్లాడేది ఒక్క డిప్యూటీ చైర్మన్‌కు తప్ప ఎవరికీ వినిపించలేదు. సభ సజావుగా సాగితే తప్ప గంభీరమైన ఈ సమస్యపై తాను ఏమీ మాట్లాడలేనని, చర్చలో పాల్గొనలేనని వెంకయ్య అన్నారు. సీమాంధ్రలో ఆరు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయని, తెలంగాణలో వెయ్యి మందికి పైగా ప్రాణత్యాగం చేశారని చెప్పారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని కూడా ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు సంబంధించిన తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నామని, సభను అదుపులో ఉంచాలని కోరారు. సభను అదుపులో ఉంచాలని, స్వయంగా అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేస్తుంటే తానేమీ చేయలేనని అశక్తత వ్యక్తం చేశారు. ఈ సమయంలో కురియన్ కూడా తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తానేం చేయగలనని అన్నారు. ఆందోళన చేస్తున్న సభ్యులపై చర్య తీసుకోవాలని ఎవరైనా ప్రతిపాదిస్తే అందుకు కూడా తాను సిద్ధమేనన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నంత సేపూ నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకయ్య నాయుడి లాంటి సీనియర్ సభ్యుడు మాట్లాడుతుంటే కనీసం వినడానికి కూడా ఎందుకు ప్రయత్నించరని కురియన్ అడిగారు. గందరగోళం తీవ్రంగా ఉండటంతో మరో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. -
'వెల్ నుంచి వెళ్లకుంటే సస్పెండ్ చేస్తా'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర సభ్యులు రాజ్యసభలో ఆందోళన కొనసాగిస్తుండడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విభజన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సభ ఐదుసార్లు వాయిదా పడింది. వెల్‌లో నిరసన తెల్పుతున్న సీమాంధ్ర సభ్యులపై డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేపదే వెల్‌లోకి వచ్చి నిరసన తెల్పుతున్న సుజనా చౌదరికి కురియన్ వార్నింగ్ ఇచ్చారు. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో ఏం చర్చించాలనేది నిర్ణయించవలసింది మీరు కాదని చౌదరితో అన్నారు. మీరు అప్రజాస్వామికంగా వ్యహరిస్తున్నారంటూ డిప్యూటీ చైర్మన్‌పై చౌదరి విమర్శించారు. దీంతో ఆగ్రహించిన కురియన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. వెల్ నుంచి వెళ్లకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీంతో సుజనా చౌదరి వెనక్కి తగ్గారు. -
బిల్లుపై చర్చిద్దాం.. సహకరించండి: కురియన్
తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో వివరంగా చర్చిద్దామని డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్ పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మధ్యాహ్నం మూడు గంటలకు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వెల్ వద్ద నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు సీమాంధ్ర ఎంపీలు, మరోవైపు తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు వెల్ వద్దకు చేరి తమ తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూనే ఉన్నారు. పలుమార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి రాజ్యసభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. ఆ సమయంలో బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించామని, అందువల్ల దీనిపై చర్చకు సహకరించాలని సభ్యులకు కురియన్ విజ్ఞప్తి చేశారు. అటార్నీ జనరల్‌ను సభకు పిలిపించాలని సుజనా చౌదరి కోరారని, దాన్ని కూడా సవరణల గురించి చర్చకు వచ్చినప్పుడు పరిగణనలోకి తీసుకుందామని, అందువల్ల సభ్యులంతా తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. కావాలంటే సభ్యులు బిల్లును వ్యతిరేకించవచ్చని, అది ప్రజాస్వామ్యంలో భాగమేనని ఆయన అన్నారు. అందువల్ల చర్చ సాగేందుకు అనుగుణంగా సభ్యులు సహకరిస్తే అన్ని సవరణల గురించి కూడా చర్చించవచ్చని తెలిపారు. ఈ గందరగోళం మధ్య వెంకయ్య నాయుడు తదితర సభ్యులు లేచి ఏదో మాట్లాడుతున్నా ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. వెల్ వద్ద నిల్చున్నవాళ్లకు సీనియర్లు నచ్చజెప్పి వెనక్కి తీసుకెళ్లాలని కూడా కురియన్ కోరారు. అయినా ప్రయోజనం ఏమీ కనపడలేదు. చర్చ జరుగుతుందని తాను హామీ ఇస్తానని, అందరూ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. చర్చ ప్రారంభం కాకముందే సవరణలను పరిగణనలోకి తీసుకోడానికి నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పారు. -
చిదంబరం X కురియన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం అరుదైన గొడవ చోటుచేసుకుంది. సభ కార్యకలాపాలపై ఆర్థిక మంత్రి చిదంబరం, సభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వాగ్యుద్ధానికి దిగారు. దీంతో గందరగోళం చెలరేగి సభ గంటపాటు స్తంభించింది. హింసతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌లోని కిష్ట్వార్ పరిస్థితిపై మాట్లాడేందుకు కురియన్ విపక్ష నేత అరుణ్ జైట్లీకి అనుమతివ్వడంతో రభస మొదలైంది. కాశ్మీర్ ప్రభుత్వం జైట్లీని కిష్ట్వార్కు వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడేందుకు ఆయనకు అనుమతివ్వాలన్న బీజేపీ సభ్యుల విజ్ఞప్తికి కురియన్ స్పందించి జైట్లీని పిలిచారు. అయితే చిదంబరం జోక్యం చేసుకుని కిష్ట్వార్పై ప్రకటన చేస్తానని, మొదట తననే మాట్లాడనివ్వాలని పట్టుబట్టారు. కురియన్ ఒప్పుకోలేదు. చిదంబరం ప్రకటన చేయాలని అనుకుంటే ముందే తనకు చెప్పి ఉండాల్సిందన్నారు. దీంతో చిదంబరం నిరసన వ్యక్తం చేస్తూ ‘ఇది పూర్తిగా కొత్త సంప్రదాయం’ అని అన్నారు. చిదంబరానికి కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికారు. ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. కురియన్ వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. చిదంబరమూ వెనక్కి తగ్గలేదు. మరోపక్క బీజేపీ కూడా కాంగ్రెస్ తీరుపై నిరసన తెలపడంతో రభసకు దారితీసింది. దీంతో కురియన్ సభను అరగంట వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 12.40కి తిరిగి మొదలు కాగానే గొడవ కూడా మొదలైంది. సాధారణంగా సభలో ముందుగా మాట్లాడే అవకాశాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందని, అయితే తాను విపక్ష నేతను అప్పటికే పిలవడంతో ఆయనే మాట్లాడడం సబబని కురియన్ చెప్పారు. జైట్లీ మాట్లాడిన తర్వాత ఆర్థిక మంత్రి మాట్లాడాలన్నారు. అయితే జైట్లీ మాట్లాడాక బీఎస్పీ స భ్యుడు సతీశ్ మిశ్రా మాట్లాడేందుకు కురియన్ మొదట్లో అనుమతివ్వడంతో మిశ్రా నిరసన తెలి పారు. గొడవ సద్దుమణగకపోవడంతో ఒంటి గంటవరకు స్తంభించింది. చివరకు జైట్లీ మాట్లాడాక ఇతరులను అనుమతిస్తానని సభాపతి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది.