హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 2 వ తేదీని వేతనంతో కూడిన సెలవు రోజుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మిక చట్టంలోని సెక్షన్ 135-బి(4)ను అనుసరించి ప్రైవేట్ విభాగాలలో, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని వారందరికీ వర్తిస్తుందని కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.