అల్ ఖైదా అధినేత కూతుళ్లను వదిలేసిన పాక్ | Pak releases 2 daughters of Qaeda chief in exchange for ex-army chief's son | Sakshi
Sakshi News home page

అల్ ఖైదా అధినేత కూతుళ్లను వదిలేసిన పాక్

Published Sat, Sep 3 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

అల్ ఖైదా అధినేత కూతుళ్లను వదిలేసిన పాక్

అల్ ఖైదా అధినేత కూతుళ్లను వదిలేసిన పాక్

వాషింగ్టన్: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహిరి ఇద్దరు కూతుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం వదిలిపెట్టింది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని అల్ ఖైదా చెర నుంచి విడిపించింది. ఈ విషయాన్ని అల్ ఖైదా స్వయంగా తన మేగజైన్ అల్-మస్రాలో వెల్లడించింది. ఈ సంఘటన వల్ల దేశంలో టెర్రరిజం ఎంతగా బలపడిందో తెలుస్తోందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

కొద్ది వారల క్రితం అల్ ఖైదా-పాకిస్తాన్ లు ఒకరినొకరు చేతులు మార్చుకున్నట్లు మేగజైన్ లో పేర్కొనటం జరిగింది. కాగా జిహాదీలు, అల్ ఖైదా, తాలిబన్లను కయానీ ప్రోత్సహించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కయానీ తనయుడి కోసం జవహరీ కూతుళ్లను వదిలిపెట్టడానికి పాక్ ప్రభుత్వం తొలుత అంగీకరించలేదు. అయితే పెద్ద సంఖ్యలో సంప్రదింపుల అనంతరం అల్ ఖైదాతో పాక్ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఏడాదిలో ముగ్గురు మహిళలు, పిల్లలను పాక్ ప్రభుత్వం అల్ ఖైదాకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement