కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం | Pakistan Air Force fighter jet crashes, pilot killed | Sakshi
Sakshi News home page

కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం

Published Tue, Oct 18 2016 5:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం

కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం

కరాచీ: పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. మస్రూర్ బేస్ నుంచి వెళ్తుండగా కరాచీకి 16 కిలో మీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాని చేరుకున్నారు.

ట్రైనింగ్ మిషన్లో భాగంగా ఈ విమానం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. జనావాసాలకు దూరంగా విమానం కూలడంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్లో తయారు చేశారు. గత నెలలో కూడా పాక్లో ఓ యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ మరణించాడు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement