
ఆకాశంలోనే ప్రాణం పోయింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా (ఖతర్) వెళ్లాల్సిన విమానాన్ని మెడికల్ ఎమర్జన్సీ కారణంగా పాకిస్థాన్కు దారి మళ్లించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ఆకాశంలోనే ప్రాణాలు కోల్పోయాడు. జెట్ ఎయిర్వేస్ అధికారులు మంగళవారం ఈ విషయం చెప్పారు.
జెట్ ఎయిర్వేస్ 9 డబ్ల్యూ 202 విమానం సోమవారం ఢిల్లీ నుంచి దోహాకు బయల్దేరింది. ఇందులో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు తీవ్ర అస‍్వస్థతకు గురవడంతో విమానాన్ని దారి మళ్లించి కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం ఈ విమానం ఢిల్లీకి తిరిగివచ్చింది. మృతుడి వివరాలు తెలియాల్సివుంది.