జాక్ పాట్ కొట్టేసిన పేటీఎం
ముంబై: దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎంలోకి జపాన్ కేంద్రంగా కార్యకలాపాలునిర్వహిస్తున్న సాఫ్ట్ బ్యాంక్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. పేటీఎంకు పేరెంట్ కంపెనీగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ నుంచి జాక్ పాట్ కొట్టేసింది. 1.4 బిలియన్ల (10వేల కోట్లు) డాలర్ల పెట్టుబడులను తాజాగా ప్రకటించింది. రాబోయే రెండు, మూడు సం.రాల్లో వీటిని పేమెంట్ బ్యాంక్ లో వీటిని వినియోగించనుంది. దీంతో పేటీఎం నికర విలువ ఎనిమిది బిలియన్ డాలర్లను మించిపోనుంది. ఈ పెట్టుబడుల విషయాన్ని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
భారత ప్రభుత‍్వ డిజిటల్ సేవల ప్రోత్సాహం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ చెల్లింపులు సహా విస్తృత శ్రేణి ఆర్థిక సేవలకు డిజిటల్ సదుపాయం కల్పించడం ద్వారా వందల మిలియన్ల మంది భారతీయ వినియోగదారులు మరియు వ్యాపారుల జీవితాలను మార్చడం కోసం తాము కట్టుబడి ఉన్నామని సాఫ్ట్ సాఫ్ట్ గ్రూప్ ఛైర్మన్ , సీఈవో మసాయోసి సన్ చెప్పారు.తమ జట్టు విజన్ కు సాఫ్ట్‌బ్యాంక్ తాజా పెట్టుబడి, అద్భుతమైన పారిశ్రామికవేత్త మసాయోసి సన్ మద్దతు అపూర్వమని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.
ఇప్పటికే మొబైల్ వ్యాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో దూసుకుపోతున్న పేటీఎం తాజా పెట్టుబడులను త్వరలో ప్రారంభించనున్న పేటీఎం బ్యాంకు విస్తరణకు వినియోగించనునుంది. ఎనలిస్టులు ఊహించినదానికంటే ఎక్కువగా భారీ మొత్తంలో సింగిల్ ఇన్వెస్టర్‌నుంచి పెట్టుబడులను అందుకుని పేటీఎం భారీ ఆఫర్ కొట్టేసిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా మే నెల 23 నుంచి పేమెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు పేటీఎం ప్రకటించింది. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంక్ నుంచి అనుమతిపొందినట్టు తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) పేరుతో సేవలను ఆరంభించబోతున్నది. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఈ-వ్యాలెట్ కింద ఉన్న 21.8 కోట్ల మంది వినియోగదారులు బ్యాంకింగ్ సేవల పరిధిలోకి రానున్నట్లు కంపెనీ పబ్లిక్ నోటీస్‌లో పేర్కొంది. వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు పేమెంట్ బ్యాంక్ సేవలు అందించడానికి ఆర్‌బీఐ లైసెన్స్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.