పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు | petrol, diesel prices hiked | Sakshi
Sakshi News home page

పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

Published Sat, Dec 21 2013 2:45 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

petrol, diesel prices hiked

 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగారుు. పెట్రోల్ ధర లీటర్‌కు 41 పైసలు చొప్పున, డీజిల్ ధర 10 పైసలు మేరకు పెరిగింది. పెట్రో డీలర్ల కమీషన్ పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో శుక్రవారం ఈ పెంపుదల చోటు చేసుకుంది. పెరిగిన ధరలకు స్థానిక అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అదనం. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చారుు. రూపారుు విలువ క్షీణించిన నేపథ్యంలో కూడా చమురు కంపెనీలు గత ఏడు వారాలుగా ధరల పెంపు జోలికి పోలేదు. అరుుతే ప్రభుత్వం డీలర్ కమీషన్‌ను 21 పైసలు పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో దీన్ని అవకాశంగా తీసుకుని పెట్రోల్ ధరను లీటర్‌కు మరో 20 పైసలు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నారుు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.02 కాగా తాజా పెంపుతో అది రూ.71.50 వరకు చేరనుంది. ఇక డీజిల్ ధర రూ.53.67 నుంచి రూ.53.80కి చేరనుంది. పెట్రోల్ ధరను చివరిసారిగా నవంబర్ 1న, డీజిల్ ధరను డిసెంబర్ 1న సవరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement