గత నెలలో పోకిమన్ గో సెర్వర్లను హ్యాకింగ్ చేసిన 'అవర్ మైన్' అనే హ్యాకింగ్ గ్రూపు వాళ్లు.. తాజాగా ఆ గేమ్ను సృష్టించిన నియాంటిక్ కంపెనీ సీఈవో జాన్ హాంక్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. జపాన్‌కు చెందిన నింటెండో కంపెనీతో కలిసి ఈ గేమ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. హాంక్ ఖాతాను తమ నియంత్రణలోకి తీసుకున్న హ్యాకర్లు.. అందులో అనేక ట్వీట్లు పోస్ట్ చేశారు. వాటిలో హాంక్ పాస్‌వర్డ్‌ను కూడా పెట్టేశారు. #అవర్‌మైన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వాళ్లు ఈ ట్వీట్లను పోస్ట్ చేశారు.
జూలై నెలలో ఇదే హ్యాకింగ్ గ్రూప్ వాళ్లు పోకిమన్ గో లాగిన్ సెర్వర్లను హ్యాక్ చేశారు. దాంతో చాలామంది గేమ్ యూజర్లు అసలు గేమ్‌లోకి లాగిన్ కాలేక చాలా ఇబ్బంది పడ్డారు. పోకిమన్ గో ప్రతినిధులు తమను సంప్రదించేవరకు తాము దాడులు ఆపబోమని గ్రూప్ సభ్యులు చెబుతున్నారు. ఈలోపు ఎవరూ ఆ గేమ్ ఆడే అవకాశం ఉండబోదని, గేమ్ నిర్వాహకులకు దాన్ని ఎలా కాపాడుకోవాలో తాము చెబుతామని తమ సొంత వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. డీడీఓఎస్ ఎటాక్ అంటే..ఒకేసారి భారీమొత్తంలో ఆ సెర్వర్‌లోకి ట్రాఫిక్‌ను పంపుతారు. దాంతో అసలైన యూజర్లు అసలు లాగిన్ కావడానికి కూడా అవకాశం ఉండదు. ఇంతకుముందు తాము ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ సీఈవోల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేశామని అవర్ మైన్ చెబుతోంది.
పోకిమన్ గో సృష్టికర్త ట్విట్టర్ ఖాతా హ్యాక్!
Published Tue, Aug 2 2016 11:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
Advertisement