పాల్వాయి ప్రశ్నకు మంత్రి జయంతి నటరాజన్ జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు మంజూరుచేసిన పర్యావరణ, అటవీ, ఆర్‌ఆర్, టీఏసీ అనుమతులను పక్కనపెడుతూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకెళ్లకుండా నిరోధిస్తూ శాశ్వత ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వేసిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్య తదితర అంశాలపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి జయంతి నటరాజన్ గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 29 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లాలో 42 పల్లెలు, ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు ముంపునకు గురికావచ్చునని, మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లో 1,77,275మంది నిర్వాసితులయ్యే అవకాశం ఉందని జయంతి పేర్కొన్నారు.
పోలవరం కేసు సుప్రీంలో ఉంది
Published Fri, Dec 6 2013 3:04 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement