
రూ.40 వేల కోట్లతో ప్రాణహిత-ఇంద్రావతి
మంత్రి పోచారం
బాన్సువాడ: రూ.40 వేల కోట్లతో ప్రాణహిత-ఇంద్రావతి నదుల నుంచి వృథాగా పోతున్న 350 టీఎంసీల నీటిని తెలంగాణకు మళ్లించి, ఐదు జిల్లాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ శాంతారూప్‌సింగ్ గురువారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల పథకం వల్ల ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం కేసీఆర్ దానిస్థానంలో ప్రాణహిత-ఇంద్రావతి ఎత్తిపోతల పథకానికి ప్రణాళిక రూపొందించారన్నారు. మధ్యప్రదే శ్, మహారాష్ట్ర గుండా వచ్చే ప్రాణహిత-ఇంద్రావతి నదుల్లో పుష్కలంగా నీరుంటుందని, 450 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ నీటిని వినియోగించుకోవడానికే కాళేశ్వరం వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి మిడ్‌మానేరులోకి నీరు తరలిస్తామన్నారు.