'ఇకనైనా కొత్త రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయండి'
ఖాట్మాండు: నేపాల్‌లో శతాబ్దాల రాచరిక వ్యవస్థకు ఆరేళ్ళ క్రితం భరత వాక్యం పలికిన రాజకీయ పార్టీల ఇకనైనా కీచులాటలు వీడి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలని ఆ దేశ రాష్ట్రపతి రామ్ బరాన్ యాదవ్ స్ఫష్టం చేశారు. 140 సంవత్సరాల రాచరికపు వ్యవస్థకు రాజ్యాంగ నిర్మాణంతో పూర్తి ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు. దేశానికి సాతంత్ర్యం వచ్చి ఏడు సంవత్సరాలు కావొస్తున్నా ఆయా పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేశంలో ఇప్పటివరకూ రాజకీయ శూన్యతే నడుస్తోంది. నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు కృషి చేస్తున్నా ఫలించకపోవడానికి రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉండటమే కారణం. 2008 మే 28వ తేదీన ఆ దేశ రాజ్యాంగ సభను రద్దు చేశారు.ఇప్పటి వరకూ నేపాల్ రాజ్యాంగ వ్యవస్థను నిర్మించుకోలేదు.
ఈ క్రమంలోనే దేశ రాజకీయ పార్టీలకు సాధ్యమైనంత త్వరలో రాజ్యాంగ సాధనకు కృషి చేయాలని రాష్ట్రపతి బరాన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు అయ్యిందని.. ఇక తప్పించుకోవడానికి కూడా వేరే ప్రత్యామ్నాయం లేదని సూచించారు.
ఇదిలా ఉండగా ఆదే శ 7 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది ఖైదీలను నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది. మే 29వ తేదీన స్వాతంత్య వేడుకలు జరుపుకుంటున్న నేపాల్.. ముందుగా వేర్వేరు జైళ్లలో ఉంటున్న 155మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఖైదీల క్షమాభిక్షపై రాష్ట్రపతి రామ్ బరాన్ కు ఒక నివేదికను అందజేసింది.