బాదాన్: అత్యాచారాలకు కేంద్ర బిందువుగా మారిన ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చినా ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఎద్దేవా చేశారు. 'అమాకులైన ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురైనా..ప్రభుత్వం వాటిని దాచడానికి యత్నిస్తోంది. కనీసం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించలేదు. అసలు ప్రభుత్వం కనీసం స్పందిచకపోవడం దారుణం' అని కళ్యాణ్ సింగ్ విమర్శించారు. అత్యాచార బాధిత కుటుంబాల్ని కలిసిన ఆయన వారికి సానుభూతిని తెలియజేశారు.
ఇదొక హృదయ విదారకర ఘటనగా ఆయన అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను ప్రక్క దోవ పట్టించేందుకు అఖిలేష్ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు.ఇటువంటి అసాంఘిక ఘటనపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అఖిలేష్ చిన్నపిల్లల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.