న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ (సీఐసీ) కొత్త కమిషనర్‌గా ఆర్కే మాథుర్ జనవరి 4న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల ద్వారా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. మాధుర్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ డిసెంబర్ 16న మాథుర్‌ను సీఐసీ చీఫ్‌గా ఎంపిక చేసింది. అంతకుముందున్న కమిషనర్ విజయ్ శర్మ పదవీ కాలం డిసెంబర్ 1న పూర్తయ్యింది. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.
4న కొత్త సీఐసీగా మాథుర్ బాధ్యతల స్వీకరణ
Published Fri, Jan 1 2016 10:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM
Advertisement