ఓ పుస్తకం రాసి పెడుదురూ.. నూపుర్ తల్వార్కు ఆఫర్ల వెల్లువ! | Publishers approaching Nupur Talwar for Aarushi book | Sakshi
Sakshi News home page

ఓ పుస్తకం రాసి పెడుదురూ.. నూపుర్ తల్వార్కు ఆఫర్ల వెల్లువ!

Published Fri, Nov 29 2013 8:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

ఓ పుస్తకం రాసి పెడుదురూ.. నూపుర్ తల్వార్కు ఆఫర్ల వెల్లువ!

ఓ పుస్తకం రాసి పెడుదురూ.. నూపుర్ తల్వార్కు ఆఫర్ల వెల్లువ!

జైల్లో ఉన్నవాళ్లందరూ పుస్తకాలు రాయడం, వాటిద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా కుమార్తె హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నూపుర్ తల్వార్ వద్దకు ప్రచురణ కర్తలు క్యూ కడుతున్నారు. సుదీర్ఘంగా సాగిన విచారణ, కుమార్తె హత్య, ఇతర అంశాల ఆధారంగా ఓ పుస్తకం రాసి పెట్టమని వాళ్లంతా కోరుతున్నారు. ఇలా వెళ్లేవారిలో కేవలం మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ప్రచురణ కర్తలు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కొంతమంది వచ్చి నూపుర్ తల్వార్ను కలుస్తామన్నారని, ఎందుకని అడిగితే వాళ్లలో ఒకరు ఈ విషయం చెప్పారని దాస్నా జైలు సూపరింటెండెంట్ వీరేష్రాజ్ శర్మ తెలిపారు.

విచారణ జరుగుతున్నసమయంలో కూడా చాలామంది అడిగినా అప్పట్లో ఆమె రాయలేకపోయారని, ఇప్పుడు ఎటూ తీర్పు వచ్చేసింది కాబట్టి ఇదే సరైన సమయమని కూడా ఓ ప్రచురణకర్త అన్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం నూపుర్ ఎవరికీ ఓకే చెప్పలేదు. మరోవైపు తల్వార్ దంపతులు క్రమంగా జైలు వాతావరణానికి అలవాటు పడుతున్నారు. ఇతర ఖైదీలతో కలిసి తింటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement