తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వరంగల్ ఎన్కౌంటర్పై చర్చ పెట్టాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వరంగల్ ఎన్కౌంటర్పై చర్చ పెట్టాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటివరకు 5000 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సీపీఐ తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని నిర్భందాలు సృష్టించినా అసెంబ్లీ వరకు చేరుకుంటామని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడిక్కడ నిరసనలు చేపట్టాలని చాడ పిలుపునిచ్చారు.