చంద్రుడిపై కూడా ప్రకంపనలు!
న్యూఢిల్లీ: సాధారణంగా భూకంపం అనేది భూమి మీదనే వస్తుందనేది మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే, చంద్రుడిపై కూడా అది వస్తుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. భూకంపం రావాడానికి ప్రధాన కారణమైన టెక్టానిక్ ప్లేట్ల కదలిక చంద్రుడిపై ఉందని, అక్కడ కూడా ఉపరితలాన్ని అవి కంపించేలా చేస్తాయని అధ్యయనం పేర్కొంది.
చంద్రయాన్-1 తీసిన చిత్రాలు గమనించిన నిపుణులు చంద్రుడి ఉపరితలం కింద కూడా భారీ స్థాయిలో టెక్టానిక్ ప్లేట్లు ఉన్నాయని, అవి అచ్చం భూమిమీద ప్రకంపనలు సృష్టించినట్లుగానే చంద్రుడిపై కూడా పుట్టిస్తాయని వెల్లడించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ విభాగంలో జియాలజీ, రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సౌమిత్రా ముఖర్జీ, ఆమె విద్యార్థులతో కలిసి పరిశోధించి ఈ విషయాలు వెల్లడించారు.