quakes
-
గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...!
భూగ్రహం కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చే అనే భావనతో నాసా ఇప్పటికే మార్క్పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ అనే రోవర్లను ప్రయోగించింది. ఈ రోవర్స్ సహాయంతో నాసా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. చదవండి: Jeff Bezos: జెఫ్బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! భారీ ప్రకంపనతో ఊగిపోయిన మార్స్....! తాజాగా అంగారక గ్రహంపై ఈ నెల 18 న సుమారు 90 నిమిషాల పాటు భారీ ప్రకంపనలు సంభవించాయని నాసా వెల్లడించింది. నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ అంగారక గ్రహంపై నమోదైన భారీ ప్రకంపనలను రికార్డు చేసింది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అధికమని నాసా పేర్కొంది. ఇన్సైట్ ల్యాండర్ ఇప్పటివరకు అంగారకపై సుమారు 700 ప్రకంపనలను గుర్తించింది. ఇన్సైట్ అందించిన సమాచారంతో నాసా శాస్త్రవేత్తలు భావించినా దాని కంటే అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉందని గుర్తించారు. భూగ్రహంతో పోలిస్తే అంగారకపై ప్రకంపనలు ఎక్కువ సమయం పాటు రావడానికి కారణం అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉండడమే కారణమని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఇన్సైట్ ల్యాండర్ పగటి సమయంలో ప్రకంపనలను రికార్డు చేయడం ఇదే తొలిసారి. చదవండి: క్రిప్టో కరెన్సీ: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.. ‘సొల్లు’ రీజన్స్!! అనూహ్య ప్రకటన -
చంద్రుడిపై కూడా ప్రకంపనలు!
న్యూఢిల్లీ: సాధారణంగా భూకంపం అనేది భూమి మీదనే వస్తుందనేది మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే, చంద్రుడిపై కూడా అది వస్తుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. భూకంపం రావాడానికి ప్రధాన కారణమైన టెక్టానిక్ ప్లేట్ల కదలిక చంద్రుడిపై ఉందని, అక్కడ కూడా ఉపరితలాన్ని అవి కంపించేలా చేస్తాయని అధ్యయనం పేర్కొంది. చంద్రయాన్-1 తీసిన చిత్రాలు గమనించిన నిపుణులు చంద్రుడి ఉపరితలం కింద కూడా భారీ స్థాయిలో టెక్టానిక్ ప్లేట్లు ఉన్నాయని, అవి అచ్చం భూమిమీద ప్రకంపనలు సృష్టించినట్లుగానే చంద్రుడిపై కూడా పుట్టిస్తాయని వెల్లడించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ విభాగంలో జియాలజీ, రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సౌమిత్రా ముఖర్జీ, ఆమె విద్యార్థులతో కలిసి పరిశోధించి ఈ విషయాలు వెల్లడించారు.