‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ప్రయోగాత్మక విధానం | Quantitative easing is a very experimental policy: Kenneth Rogoff | Sakshi
Sakshi News home page

‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ప్రయోగాత్మక విధానం

Published Wed, Dec 18 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ప్రయోగాత్మక విధానం

‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ప్రయోగాత్మక విధానం

ముంబై: అమెరికా అనుసరిస్తున్న సహాయక ప్యాకేజీ (క్వాంటిటేటివ్ ఈజింగ్) విధానం చాలా ప్రయోగాత్మకమైనదని ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కెనెత్ రాగాఫ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో (ఆర్థిక సంక్షోభం వంటివి) తాము అనుసరించే విధానాలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో.. ఫలితాలు వచ్చే దాకా విధానకర్తలకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఎల్‌కే ఝా 14వ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కెనెత్ ఈ విషయాలు తెలిపారు. 2008 నాటి సంక్షోభ ప్రభావాల నుంచి అమెరికా ఎకానమీని బైటపడేసేందుకు అనుసరిస్తున్న క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానంలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ ప్రతి నెలా 85 బిలియన్ డాలర్ల మేర బాండ్ల కొనుగోలు చేస్తూ వ్యవస్థలోకి నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement