అయ్యో వైశాలి.. ఎంత దారుణం జరిగింది! | Rajasthan man hacks 18-year-old girl to death in Banswara | Sakshi
Sakshi News home page

అయ్యో వైశాలి.. ఎంత దారుణం జరిగింది!

Published Fri, Aug 4 2017 3:02 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

అయ్యో వైశాలి.. ఎంత దారుణం జరిగింది!

అయ్యో వైశాలి.. ఎంత దారుణం జరిగింది!

బన్స్‌వారా: రాజస్థాన్‌లోని బన్స్‌వారా పట్టణానికి చెందిన 18 ఏళ్ల వైశాలి ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి మంచి మార్కులు సాధించిన ఆమెకు.. ఉన్నత చదువులు పూర్తిచేసి పేరుతెచ్చుకోవాలన్నదే లక్ష్యం. అందుకే అనవసర విషయాలకు దూరంగా ఉండేది.

ఆమె పక్కింట్లో నివసించే జగదీశ్‌‌.. అస్తమానం ప్రేమ, ప్రేమ అంటూ వెంపడేవాడు. ఇటీవల అతని వేధింపులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదుకూడా ఇచ్చింది. కానీ పోలీసులు ఆ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదు.

బుధవారం వైశాలి ఇంటిపనులు చేసుకుంటుండా, గోడ దూకి లోపలికొచ్చిన జగదీశ్‌.. అత్యంత పాశవికంగా కత్తితో ఆమె గొంతును పలుమార్లు కోసి పరారయ్యాడు. ఇంటి రెండో అంతస్తులో ఉన్న తండ్రి(దివ్యాంగుడు) కిందికి వచ్చేలోగా వైశాలి రక్తపు మడుగులో పడిపోయింది. చుట్టుపక్కలవారి సహాయంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వైశాలి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

తీవ్రంగా గాలించిన అనంతరం నిందితుడు జగదీశ్‌ను పోలీసులు పట్టుకున్నారు. తన ప్రేమను నిర్లక్ష్యం చేసినందుకే వైశాలిని చంపేసినట్లు, తనకు దక్కనిది వేరొకరికి దక్కనీయకూడదన్న ఆలోచనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు జగదీశ్‌ పోలీసులకు చెప్పాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబం కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement