జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల మూడో జాబితా కాంగ్రెస్ ప్రకటించింది. దీంట్లో వివిధ కేసులపై జైలుపాలైన మాజీ నేతల బంధువులకు చోటు కల్పించింది. అంతేగాక లైంగిక వేధింపుల, అక్రమ మైనింగ్ ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బహిష్కృతులైన ఇద్దరు మాజీ మంత్రులు కూడా చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల కోసం 71 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ శనివారం రాత్రి విడుదల చేసింది. సంచలనం సృష్టించిన భన్వారీ దేవి మానభగం, హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న మహిపాల్ మాదెర్న, మిల్కాన్ సింగ్ బిష్ణోయ్, మరో రేప్ కేసులో జైలుపాలైన బాబూలాల్ నగార్ దగ్గరి బంధువులు ఆ జాబితాలో సీట్లు సంపాదించారు.
మదెర్నా భార్య లీలా మదెర్నా ఓసియాన్ స్థానాన్నుంచి, బిష్ణోయ్ తల్లి, 80 ఏళ్ల అమ్రీ దేవి లునీ నుంచి, నగార్ సోదరుడు హజారీ నగార్ డుడు స్థానాన్నుంచి పోటీకి దిగుతున్నారు. కాగా, లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటూ మంత్రి పదవి కోల్పోయిన రామ్‌లాల్ జాట్, అక్రమ మైనింగ్ ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి వైదొలిగిన భరోసిలాల్ జాదవ్ వరుసగా అసిద్, హిం దాన్ టికెట్లు సాధించారు. ఝలారపటన్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వసుం ధర రాజేపై యూత్ కాంగ్రెస్ నేత మీనాక్షి చంద్రావత్ పోటీకి దిగుతున్నారు.
కాంగ్రెస్ జాబితాలో నేర ‘బంధువులు’
Published Mon, Nov 11 2013 1:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement