రివర్స్ గేర్..
ఈ ఫొటో దేనిదో మీకు తెలుసా? సరిగ్గా చూడండి. ఇవన్నీ భారీ భవనాలు! ఆకాశహర్మ్యాల ఫొటోలు చాలా మంది తీస్తారు. కానీ ఇలా తీస్తారా.. అదే ఫ్రాన్స్‌కు చెందిన ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్ రొమెయిన్ జాక్వెట్ గొప్పతనం. ఆయన భవనాలను ఇలా కింద నుంచి నిలువుగా తీస్తూ.. చిత్రవిచిత్రాలు చేస్తాడు. దూరం నుంచి భవనం ఎత్తును కొలవడం సులువే.. కానీ ఇలా దాని మూలం నుంచి ఫొటో తీస్తే.. దాని మజాయే వేరేగా ఉంటుందని జాక్వెట్ చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆకాశహర్య్మాలను వర్టికల్ యాంగిల్‌లో తాను తీసిన ఫొటోలతో అతను ఓ పేద్ద పుస్తకమే ప్రచురించాడు.