reverse gear
-
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
రివర్స్ గేర్‌లో 75 కి.మీ.లు
కర్ణాటక: ట్రాక్టర్‌ను రివర్స్‌లో నడుపుతూ ఓ యువకుడు తమ ఇలవేల్పు యల్లమ్మ దేవికి మొక్కుబడి తీర్చుకున్నాడు. హుబ్లీ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన బాబుగౌడ(22) అనే ఈ భక్తుడు గత కొన్నేళ్లుగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. అయితే రివర్స్ గేర్‌లో ఇలా 75 కి.మీ. వెళ్లడం ఇదే మొదటిసారి అని, కోర్కె తీరడంతో మొక్కు తీర్చానన్నాడు. ఆ మేరకు ఉదయం 6.15 గంటలకు మంటూరు వలంబేశ్వర దేవస్థానం నుంచి రివర్స్ గేర్‌లో బయల్దేరాడు. కుసుగల్, బ్యాహట్టి, తిర్లాపుర, అళగవాడి, హంచనాళ, తిక్కుంబి, హిరేకుంబి, ఉగరగోళ, సౌదత్తికి వెళ్లి అక్కడి నుంచి యల్లమ్మన గుడ్డను మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకొన్నాడు. మొత్తం 75 కి.మీ.ల దూరాన్ని 7.30 గంటల్లో ప్రయాణించాడు. -
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్‌గేర్‌లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్‌లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్‌ను ప్రకటించడం తెలిసిందే. -
‘హీరో’ రివర్స్ గేర్!
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో రూ. 6 వేల కోట్లతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన హీరో మోటోకార్ప్ సంస్థ ఇప్పుడు రివర్స్ గేర్‌లో నడుస్తోందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడంతో పక్క చూపులు చూస్తోందా? అంటే అవునంటున్నాయి అధికారవర్గాలు. కేంద్రం ‘ప్రత్యేక హోదా’ ఇస్తే ఎలాంటి రాయితీలు వస్తాయో.. అలాంటి రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ తాజాగా ఆ సంస్థ షరతు పెట్టడం ఇందుకు బలం చేకూర్చుతోంది. పారిశ్రామికాభివృద్ధిపై రోజూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నా.. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం తన సొంత జిల్లాలో హీరో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, ఆ సంస్థ నుంచి ఉలుకూపలుకూ లేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో చంద్రబాబు దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హీరో పరిశ్రమ ఆటోమొబైల్ హబ్‌కు ఊతమిస్తుందంటూ ప్రభుత్వం పేర్కొంది. ఆటోమొబైల్ విధానం ప్రకటించినా.. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసకుప్పం వద్ద హీరో సంస్థకు 650 ఎకరాల భూమిని గతేడాది సెప్టెంబరు 16న కేటాయించింది. ఈ పరిశ్రమకు రాయితీలు కల్పిం చాలన్న ప్రధాన లక్ష్యంతో ఆటోమొబైల్ విధానాన్ని డిసెంబర్ 1న ప్రభుత్వం విడుదల చేసింది. పరిశ్రమకు యూనిట్ విద్యుత్‌ను 75 పైసలు చొప్పున సరఫరా చేసేందుకు సర్కారు అంగీకరించింది. 20 ఏళ్ల పాటు పరిశ్రమకు వ్యాట్ నుంచి మినహాయింపును ఇచ్చింది. పదేళ్ల పాటు వంద శాతం సీఎస్టీని రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. పది శాతం రాయితీపై భూమి, పెట్టుబడి రాయితీ పది శాతం, ఐదు శాతం వడ్డీ రాయితీ, ఉచితంగా డబులైన్ రోడ్డు, 50 శాతం రాయితీపై నీటిని సరఫరా చేస్తామని ఆటోమొబైల్ విధానంలో పేర్కొంది. అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యే జూన్ 8లోగా కనీసం హీరో పరిశ్రమకైనా శంకుస్థాపన చేయాలని సీఎం భావించారు. పక్క రాష్ట్రాల వైపు చూపు.. తొలి దశలో రూ. 2,200 కోట్లతో ఏడాదికి 1.8 మిలియన్ వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు హీరో సంస్థ అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఆటోమొబైల్ విధానాలు మెరుగ్గా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాకనే పరిశ్రమ పనులను ప్రారంభిస్తామని, లేదంటే అలాంటి రాయితీలు ఇప్పుడిచ్చినా పరిశ్రమ స్థాపిస్తామని హీరో ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇదే అదనుగా తమిళనాడు ప్రభుత్వం హీరో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా చేకూరే లబ్ధిని తామే కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై ‘హీరో’సానుకూలంగా ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
అళగిరి రివర్స్ గేర్
పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేందుకు ఓ వైపు కసరత్తులు జరుగుతుంటే, మరో వైపు రివర్స్ గేర్ వేస్తూ అధిష్టానంపై అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకేలో మళ్లీ చర్చకు తెర లేపింది. డీఎంకేతో సామరస్యం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ అర్హతలున్నాయని నాయకత్వానికి స్టాలిన్ పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరుణానిధిని కలిసేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై:డీఎంకేలో సాగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీలో సమూల మార్పుల లక్ష్యంగా అధినేత కరుణానిధి కుస్తీలు పడుతున్నారు. పార్టీలో సాగుతున్న వివాదాలకు ముగింపు పలికే విధంగా కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. ఇందులో ప్రధాన అంశంగా ఉన్న అళగిరి ఎపిసోడ్‌కు శుభం కార్డు వేయడానికి పావులు కదుపుతున్నారు. బహిష్కరణకు గురైన పెద్దకుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని మళ్లీ పార్టీలోకి రప్పించే విధంగా రాయబారాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా అధిష్టానం ముందు అళగిరి కొన్ని డిమాండ్లు ఉంచారు. అలాగే, సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న సూచనను దూతలు అళగిరి ముందు ఉంచారు. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేశాయి. స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక తన డిమాండ్లకు డీఎంకే అధిష్టానం దిగి రాలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ అర్హతలున్నాయ్...: బుధవారం అళగిరి మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, అటు అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు స్టాలిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో కరుణానిధిని తప్ప మరెవ్వరినీ అధి నాయకుడిగా ఏ కార్యకర్త అంగీకరించడని పేర్కొన్నారు. ఏ అర్హతలున్నాయని స్టాలిన్ నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కరుణానిధి నాయకత్వంలో డీఎంకే 2016లో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్న విషయాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ పార్టీ సమావేశంలో స్టాలిన్ గుర్తు చేశారేగానీ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని మండిపడ్డారు. ఎలాంటి అర్హతలు లేని స్టాలిన్ నాయకత్వాన్ని పార్టీలో ఏ ఒక్కరూ అంగీకరించే ప్రసక్తే లేదని శివాలెత్తారు. తాను మాత్రం డీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో సామరస్యానికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చే శారు. తన డిమాండ్లను డీఎంకే అధిష్టానం ముందు ఉంచానని, వాటిని నెరవేర్చాల్సింది వాళ్లే అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సామరస్యం ప్రసక్తే లేదని, ఎవరొచ్చినా, తన నిర్ణయం ఇదేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరుణానిధిని కూడా కలిసేది లేదని స్పష్టం చేశారు. డీఎంకే సంస్థాగత ఎన్నికలన్నీ బోగస్‌గా తేల్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు దక్కలేదని, కొత్తగా వచ్చిన వాళ్లకు, ధన బలం ఉన్న వాళ్లకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కాయని ఆరోపించారు. పార్టీలో నిజమైన సేవకులకు చోటు లేదని, నిజాయితీగా వ్యవహరిస్తే, క్రమ శిక్షణవేటు వేస్తున్నారని మండి పడ్డారు. తన కోసం నిలబడిన వారు ఎందరో డీఎంకే బాధితులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. అళగిరి తాజా వ్యాఖ్యలతో డీఎంకేలో మళ్లీ ప్రకంపన బయలు దేరినట్టే. ప్రక్షాళన వేళ మరో శిరోభారం నెత్తికెక్కడంతో అధినేత కరుణానిధి ఎలా వ్యవహరించనున్నారో వేచి చూడాల్సిందే. -
రివర్స్ గేర్..
ఈ ఫొటో దేనిదో మీకు తెలుసా? సరిగ్గా చూడండి. ఇవన్నీ భారీ భవనాలు! ఆకాశహర్మ్యాల ఫొటోలు చాలా మంది తీస్తారు. కానీ ఇలా తీస్తారా.. అదే ఫ్రాన్స్‌కు చెందిన ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్ రొమెయిన్ జాక్వెట్ గొప్పతనం. ఆయన భవనాలను ఇలా కింద నుంచి నిలువుగా తీస్తూ.. చిత్రవిచిత్రాలు చేస్తాడు. దూరం నుంచి భవనం ఎత్తును కొలవడం సులువే.. కానీ ఇలా దాని మూలం నుంచి ఫొటో తీస్తే.. దాని మజాయే వేరేగా ఉంటుందని జాక్వెట్ చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆకాశహర్య్మాలను వర్టికల్ యాంగిల్లో తాను తీసిన ఫొటోలతో అతను ఓ పేద్ద పుస్తకమే ప్రచురించాడు. -
పోలీస్ బాస్.. అంతా రివర్స్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓ పోలీస్ సెల్యూట్ కొట్టి... ‘సార్... నాకు మంచి డ్యూటీ ఇచ్చేందుకు ఈ ఇన్స్పెక్టర్ రూ.12వేలు లంచం అడుగుతున్నారు. మీరైనా న్యాయం చేయండి...’ అని ఓ కానిస్టేబుల్ ఆకస్మిక తనిఖీలకు వచ్చిన ‘బడా బాస్’ను వేడుకున్నాడు. ‘అసలేం అనుకుంటున్నావ్. నా ఎదుటే నిలబడి ఫిర్యాదు చేస్తావా... హౌ డేర్ యూ... సస్పెండ్ హిమ్...’- అని పక్కనే ఉన్న మరో అధికారిని పురమాయించారు బడా బాస్. ఇదీ ఈయన స్టైల్. తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లు స్వయంగా కానిస్టేబుల్ మొరపెట్టుకుంటే విచారణకు ఆదేశించి.. సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాల్సిన అధికారి రివర్స్ గేర్‌లో పిచ్చుక మీద బ్రహ్మస్త్రం విసిరిన తీరు జిల్లా పోలీసు విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. లంచగొండి అధికారిపై ఫిర్యాదు చేసినందుకు తనపై సస్పెన్షన్ వేటు పడనుండడంతో కానిస్టేబుల్ కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇంతకీ బడా బాస్ ఆకస్మిక తనిఖీలకు ఎందుకొచ్చారు..? ఆరా తీస్తే మరో ఆసక్తికరమైన బ్యాంక్ గ్రౌండ్ ఉంది. ‘సార్ మీరు సమర్థవంతంగా పని చేస్తున్నారు. కానీ... మీ ఆఫీసులో మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు. మీ పేరు చెప్పి మీ సీసీ లంచాలకు కౌంటర్ తెరిచారు. పోలీస్ స్టేషన్లకు తనిఖీలకు వెళ్లినప్పుడు మీకు తెలియకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రొబేషనరీ ఎస్సైలను సైతం వదిలిపెట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. స్పెషల్ బ్రాంచీ రిపోర్టు చేసింది...’ అని బడా బాస్‌ను అదే విభాగంలోని మరో బాస్ ఫోన్లోనే అలర్ట్ చేశారు. వెంటనే సొంత ఇంటిని చక్కదిద్దుకొని అవినీతి కౌంటర్‌ను బంద్ చేయించాల్సిన సదరు అధికారి మళ్లీ రివర్స్ గేర్‌లోనే వెళ్లారు. అసలు తానేంటో.. తన స్టైల్ ఏమిటో చాటిచెప్పి.. దడ పుట్టించేందుకు ఆకస్మిక తనిఖీలకు బయల్దేరారు. ఇలాంటి రివర్స్ గేర్ చర్యలతో పాటు... వరుస అవినీతి ఆరోపణలతో ఈ బడా బాస్ పేరు ఇప్పటికే రాష్ట్ర స్థాయికి వెళ్లింది. పోలీసు విభాగంలో లోకల్ అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఎస్సైలు, సీఐలు పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే జోన్లో పొరుగు జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ.. తన కార్యాలయ సిబ్బంది పైరవీతో బడా బాస్ జిల్లాకు చెందిన ఓ ఎస్సైకి జగిత్యాల డివిజన్‌లోనే పోస్టింగ్ ఇవ్వడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్సైలే కాదు.. ఇటీవల ఓ క్లర్క్ సస్పెన్షన్‌ను పక్కన పడేయడం... అవినీతి ఆరోపణలపై జిల్లా నుంచి బయటకు పంపించిన ఒక ఆఫీసు సూపరింటెండెంట్‌ను ఇటీవల జిల్లా పోలీసు ఆఫీసులో తాను కోరిన సెక్షన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం... ఇవన్నీ అటు అధికారుల స్థాయి నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు అందరి నోటా నానుతున్నాయి.