ఆలయాల ముందు అభ్యర్థుల బారులు! | Rita Bahuguna Joshi offers prayers at Hazratganj's Hanuman Temple | Sakshi
Sakshi News home page

ఆలయాల ముందు అభ్యర్థుల బారులు!

Published Sat, Mar 11 2017 8:13 AM | Last Updated on Sat, Aug 25 2018 5:02 PM

ఆలయాల ముందు అభ్యర్థుల బారులు! - Sakshi

ఆలయాల ముందు అభ్యర్థుల బారులు!

లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఆలయాల ముందు బారులు తీరారు. తమ పార్టీలు విజయం సాధించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు.

లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి.. హజ్రత్ గంజ్‌ హనుమాన్ దేవాలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ విజయం కోసం లక్నోలో హోమాలు చేపట్టారు. పలుచోట్ల ఆయా పార్టీల అభ్యర్థులను ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఎన్నికల ఫలితాలను పురస్కరించుకుని వారణాసిలో ముందుగానే లడ్డూలు తయారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement