ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు | Rs. 3.6 billions during the first half | Sakshi
Sakshi News home page

ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు

Published Tue, Mar 24 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు

ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు

బాండ్లతో ప్రభుత్వం రుణ సమీకరణ
 
 న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బాండ్ల ద్వారా దాదాపు రూ. 3.6 లక్షల కోట్ల రుణం సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 6 లక్షల కోట్లు సమీకరించాలంటూ ప్రభుత్వం నిర్దేశించుకున్న దాంట్లో ఇది దాదాపు 60 శాతం మొత్తం. వ్యయాల నిర్వహణ, గతంలో తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు ఈ మొత్తం ఉపయోగపడగలదని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి చెప్పారు.

ఏప్రిల్‌లోనే రూ. 64,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రతి వారం రూ. 14,000-16,000 కోట్లు బాండ్ల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంటుందని మహర్షి తెలిపారు. ఒకవైపు ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తుండటం.. కార్పొరేట్ డెట్ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగిస్తోందంటూ ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన రోజే కేంద్రం నిధుల సమీకరణ ప్రకటన వెలువడటం గమనార్హం.

Advertisement

పోల్

Advertisement