డాలర్ దెబ్బకు రూపాయి విలవిల | Rupee free fall continues unabated, falls to 39-month low against dollar | Sakshi
Sakshi News home page

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల

Published Thu, Nov 24 2016 10:43 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

డాలర్ దెబ్బకు  రూపాయి  విలవిల - Sakshi

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల

ముంబై:  డాలర్ విలువు రోజురోజుకి  పుంజుకోవడంతో  దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. విశ్లేషకులు భయపడిపట్టుగానే రికార్డు స్థాయిని నమోదుచేసింది. గురువారం మరో 28  పైసలు నష్టపోయిరన రూపాయి 68.84  స్థాయిని  తాకింది. దీంతో 39 నెలల కనిష్టానికి చేరి మరింత  ఆందోళన రేకెత్తిస్తోంది.
రూపాయి డాలర్‌తో పోలిస్తే నానాటికీ తీసికట్టుగా మారుతోంది.  అయితే  68.68-69 మధ్య డాలర్ - రూపాయి విలువ కదలాడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనత రాబోయే కాలంలో కొనసాగనుందని  విశ్లేషకులు భావిస్తున్నారు . రాబోయే 1-2 నెలల్లో 69.30 స్థాయిని తాకొచ్చని  కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ డెరివేటివ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్  అనింద్య బెనర్జీ  చెప్పారు.  అంతేకాదు 7-8 నెలల తర్వాత ఇది 70.50-71 స్థాయికి దిగజారవచ్చని  అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement