32 పైసలు పతనమైన రూపాయి
రెండు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: రెండు రోజులుగా బలపడుతూ వచ్చిన రూపాయి మంగళవారం 32 పైసలు నష్టపోయింది. విదేశీ నిధులు తరలిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు నెలఖరు డిమాండ్ కారణంగా డాలర్‌తో రూపాయి మారకం 32 పైసలు క్షీణించి 68.06 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్ట స్థాయి. క్రితం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 25 పైసలు లాభపడింది.
మూడు వారాల కనిష్ట స్థాయి...
పన్ను రేట్లు తగ్గాల్సిన అవసరముందన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్నప్పటికీ, రూపాయి క్షీణించింది. ఆసియా కరెన్సీలు బలహీనపడడం ప్రతికూల ప్రభా వం చూపించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని, అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలతో ఇతర విదేశీ కరెన్సీ, యెన్, యూరోల మారకంతో పోల్చితే డాలర్ బలపడుతోంది.