చైనా భయంతోనే..
చైనా భయంతోనే..
Published Mon, Jan 2 2017 7:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
బీజింగ్: తమ పరువును కాపాడుకునేందుకు రష్యా తాపత్రయ పడిందా?. తాజా పరిణామం ఈ విషయాన్నే సూచిస్తోంది. ఐదో తరానికి చెందిన సుఖోయ్ ఎస్ యూ-35 జెట్లను రెండేళ్లుగా చైనాకు అందజేయకుండా నాన్చుతూ వచ్చిన రష్యా.. ఎట్టకేలకు నాలుగు ఎస్ యూ-35 ఫైటర్లను అందించింది. అయితే, ఎస్ యూ-35 లను చైనాకు అందజేయడంలో రష్యా ఎందుకు జాప్యం చేసింది అన్న విషయంపై ఓ ఆసక్తికర రిపోర్టు వచ్చింది.
చైనా తయారుచేస్తున్న జే-20 స్టెల్త్ ఫైటర్ శక్తి సామర్ధ్యాల కంటే ఎస్ యూ-35ల సామర్ధ్యాలు తక్కువైతే తమ పరువుపోతుందని రష్యా భావించింది. అంతేకాకుండా మార్కెట్లో కూడా ఎస్ యూ-35లకు విలువ ఉండదు. దీంతో ఆత్మరక్షణలో పడిన రష్యా.. చైనాతో ఒప్పందం కుదరినా.. ఫైటర్లను అందజేతలో ఆలస్యం చేసింది.
గత నెలలో చైనా మిలటరీ జే-20 ఫైటర్ ను తొలిసారి పరీక్షించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా సుఖోయ్ ఎస్ యూ-35 లను ఒప్పందం ప్రకారం చైనాకు అందించింది. కాగా కొత్త రకపు జెట్లను తయారుచేయడంలో దూసుకుపోతున్న చైనా సొంతగా ఇంజన్ల తయారీ విషయంలో మాత్రం ఇంకా వెనుకే ఉంది. ఫైటర్లకు అవసరమయ్యే ఇంజన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
Advertisement